మోదీవి పీఆర్ స్టంట్స్.. జీడీపీ లెక్కలతో జిమ్మిక్కులు: మల్లికార్జున్ ఖర్గే

మోదీవి పీఆర్ స్టంట్స్.. జీడీపీ లెక్కలతో జిమ్మిక్కులు: మల్లికార్జున్ ఖర్గే

న్యూఢిల్లీ: దేశ ఆర్థిక వ్యవస్థ 7.8 శాతం వృద్ధి రేటు సాధించిందంటూ ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలపై ఏఐసీసీ చీఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మల్లికార్జున ఖర్గే ఫైర్ అయ్యారు. మోదీ సర్కారు తీరు ‘లైట్స్, కెమెరా, యాక్షన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌’ అన్నట్టుందని ఎద్దేవా చేశారు. ప్రజలకు అబద్ధాలు చెప్పడం మినహా క్షేత్రస్థాయిలో ఏ మార్పూ రాలేదని మంగళవారం ‘ఎక్స్’ వేదికగా పేర్కొన్నారు. 

మోదీవన్నీ పీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్టంట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అని, జీడీపీ లెక్కల పేరుతో జిమ్మిక్కులు చేస్తున్నార న్నారు. దేశంలో నిరుద్యోగం పెరిగిపోయిందని, సామాన్యుడు భరించలేనంతగా ధరలు పెరిగాయని, అపరిమిత ఆర్థిక అసమానతలు నెలకొన్నాయని తెలిపారు. వీటన్నింటికీ మోదీయే ప్రత్యక్ష బాధ్యుడని ఆరోపించారు.