పద్మారావునగర్, వెలుగు: పునరుద్ధరించిన ఖేలో ఇండియా పథకం భారత క్రీడారంగ ముఖచిత్రాన్ని మార్చే గేమ్‌చేంజర్‌గా నిలుస్తుందని, ఇది ఎప్పుడో రావాల్సిన గొప్ప విధానమని బ్యాడ్మింటన్మాజీ క్రీడాకారిణి గుత్తా జ్వాల అన్నారు. కవాడిగూడలోని పీఐబీ హాల్‌లో శుక్రవారం ఎస్ఏటీఎస్ ఎండీ సోనిబాలా దేవి, బెంగళూరు ఎస్ఏఐ రీజినల్ డైరెక్టర్ విష్ణు సుధాకరన్, ఢిల్లీ ఎస్ఏఐ డిప్యూటీ డైరెక్టర్ ఎస్.హిమబిందులతో కలిసి ఆమె మీడియాతో మాట్లాడారు.
ప్రభుత్వ మద్దతు వల్లే తాను ఈ స్థాయికి చేరుకోగలిగానని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం 2026–-31 కాలానికి గానూ ఈ పథక బడ్జెట్‌ను ఏకంగా 8 రెట్లు పెంచి రూ.29,054 కోట్లు కేటాయించిందని ఎస్ఏఐ డిప్యూటీ డైరెక్టర్ హిమబిందు వెల్లడించారు. క్రీడాకారుల సంఖ్యను 10 రెట్లు పెంచే లక్ష్యంతో 30 క్రీడాంశాల్లో వేలాది మంది అథ్లెట్లకు ప్రోత్సాహం అందించనున్నట్లు చెప్పారు. తెలంగాణకు ఇప్పటికే 33 ఖేలో ఇండియా కేంద్రాలను మంజూరు చేసి, వందలాది మందికి శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు.
మేడ్చల్-మల్కాజిగిరి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో వివిధ విభాగాల్లో అథ్లెట్లకు మెరుగైన శిక్షణ అందుతోందన్నారు. ఈ ఏడాది చివరలో తెలంగాణ వేదికగా ఖేలో ఇండియా యూత్ గేమ్స్ నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.
