వివాదంలో 'ఖుదా హఫీస్ 2' మూవీ

వివాదంలో 'ఖుదా హఫీస్ 2' మూవీ

బాలీవుడ్ సినిమా ఖుదా హఫీస్ 2 వివాదంలో చిక్కుకుంది. ఇందులో ఒక వీడియో సాంగ్ లో మొహరం మాతంను కించపరిచే విధంగా చిత్రీకరించారంటు షియా కమ్యూనిటీ పెద్దలు అభ్యంతరం వ్యక్తం చేశారు.ఈ చిత్రంపై మీర్ చౌక్ పోలీసు స్టేషన్ లో వారు ఫిర్యాదు చేశారు. వెంటనే వీడియో సాంగ్ ను మూవీ నుండి తొలగించకుంటే దేశ వ్యాప్త నిరసనలు చేస్తామని హెచ్చరించారు.

విడియో సాంగ్ లో మాతం నిర్వహించే సమయంలో కత్తులతో హింస ప్రేరేపించే విధంగా చిత్రీకరించారంటూ షియా మత పెద్దలు ఫిర్యాదులో పేర్కొన్నారు. విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా ఉన్న ఈ పాటను వెంటనే తొలగించాలన్నారు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు దర్యప్తు చేపట్టారు. కాగా, విద్యుత్ జమ్వాల్, శివలీకా ఒబెరాయ్ ఈ చిత్రంలో హీరో హీరోయిన్లుగా నటించారు. ఫరూక్ కబీర్ దర్శకత్వంలో 'ఖుదా హఫీస్ 2' మూవీ తెరకెక్కింది. జులై 8న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.