ఇరగదీసిన పొలార్డ్: 6 బాల్స్ లో 6 సిక్సులు

ఇరగదీసిన పొలార్డ్: 6 బాల్స్ లో 6 సిక్సులు

వెస్టిండీస్ ప్లేయర్ కీరన్ పోలార్డ్ ఒకే ఓవర్ లో ఆరు సిక్సులు కొట్టిన బ్యాట్స్ మెన్ లిస్టులో చేరాడు. బుధవారం రాత్రి శ్రీలంకతో జరిగిన టీ20లో అఖిల ధనంజయ వేసిన ఓవర్ లో ఆరు సిక్సులు కొట్టి రికార్డు సృష్టించాడు. వెస్టిండీస్ తరపున ఈ ఘనత సాధించిన ఫస్ట్ ప్లేయర్ గా రికార్డుల్లొకెక్కాడు.  అంతకుముందు 2007 ఇంగ్లండ్ పై భారత మాజీ ఆల్ ‌రౌండర్ యువరాజ్ సింగ్ , 2017 లో నెదర్లాండ్స్ పై సౌత్ ఆఫ్రికా మాజీ బ్యాట్స్‌మెన్ హర్షలీ గిబ్స్ ఈ ఘనత సాధించారు. లేటెస్ట్ గా ఆరు బంతుల్లో ఆరు సిక్సులు నమోదు చేసిన ఘనత కీరన్ పొలార్డ్ సాధించాడు.

ఈ మ్యాచ్‌ లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లకు 9 వికెట్లు కోల్పోయి 131 రన్స్ చేసింది. అనంతరం విండీస్ ఆరు వికెట్లు కోల్పోయి 13.1 ఓవరల్లో లక్ష్యాన్ని ఛేదించి విజయం సాధించింది.