పంజాబ్ విక్టరీ: మళ్లీ ఓడిన సన్‌‌‌‌రైజర్స్‌

పంజాబ్ విక్టరీ: మళ్లీ ఓడిన సన్‌‌‌‌రైజర్స్‌

సొంతగడ్డపై ముంబై ఇండియన్స్‌ తో జరిగిన మ్యాచ్‌ లో అనూహ్యం గాతడబడి తక్కువ స్కోరుకే పరిమితమైన సన్‌‌రైజర్స్‌ హైదరాబాద్‌‌ బ్యాట్‌ తో ఫర్వాలేదనిపించింది. కానీ, బౌలింగ్‌‌లో మెరుపులు కొరవడటంతో మరో ఓటమి మూటగట్టుకుంది. దూకుడుకు మారుపేరైన వార్నర్‌ టఫ్‌ పిచ్‌ పై వన్డే ఇన్నింగ్స్‌ ఆడితే..మిగిలిన వాళ్లు కనీస సహకారం అందిచలేకపోయారు. ఛేజింగ్‌‌లో స్లో వికెట్‌ పై క్లాస్‌ఇన్నింగ్స్‌ తో చెలరేగిన లోకేశ్‌ రాహుల్‌ , మయాంక్‌‌ అగర్వాల్‌ తో కలిసి కింగ్స్‌ లెవెన్‌‌ పంజాబ్‌‌కు విజయం కట్టబెట్టాడు. గత మ్యాచ్‌ లో మరీ నెమ్మదిగా ఆడి ఓటమికి కారణమయ్యాడనిపించిన రాహులే ఈ మ్యాచ్‌ లో కింగ్‌‌గా నిలిచాడు.

 

గత మ్యాచ్‌ లో ఓటమి పాలైన రెండు జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌ లో కింగ్స్‌‌‌‌ లెవెన్‌ పంజాబ్‌ దే పైచేయి అయింది. సోమవారం ఇక్కడ జరిగిన మ్యాచ్‌ లో సన్‌ రైజర్స్‌‌‌‌ హైదరాబాద్‌‌‌‌ 6 వికెట్ల తేడాతో పంజాబ్‌ చేతిలో ఓడింది.స్లో పిచ్‌ పై పరుగుల రాక కష్టమైన తరుణంలో లోకేశ్‌ రాహుల్‌ (53 బంతుల్లో 7 ఫోర్లు, సిక్సర్‌‌‌‌తో 71 నాటౌట్‌ )అజేయ ఆఫ్‌ సెంచరీతో కింగ్స్‌‌‌‌ను గెలిపించాడు. మొదటబ్యాటింగ్‌ చేసిన రైజర్స్‌‌‌‌ 20 ఓవర్లలో 4 వికెట్లకు 150రన్స్‌‌‌‌ చేసింది. ఓపెనర్‌‌‌‌ డేవిడ్‌ వార్నర్‌‌‌‌ (62 బంతుల్లో 6ఫోర్లు, సిక్సర్‌‌‌‌తో 70 నాటౌట్‌ ) ఫిఫ్టీతో రాణించినా..ఆశించి నంత వేగంగా ఆడలేకపోయాడు. పంజాబ్‌ బౌలర్లలో అశ్విన్‌ , షమీ, ముజీబ్‌ తలా ఓ వికెట్‌ పడగొట్టారు. ఆరంభంనుంచి ఆఖరి వరకు క్రీజులో ఉన్న వార్నర్‌‌‌‌ టెస్ట్‌‌‌‌ ఇనింగ్స్‌‌‌‌ను తలపిస్తూ .. 62 బంతులెదుర్కొని 70 పరుగులేచేశాడు. విజయ్‌ శంకర్‌‌‌‌ (27 బంతుల్లో 2 ఫోర్లతో26) కూడా స్లోగానే ఆడాడు.చివర్లో దీపక్‌ హుడా ( 3బంతుల్లో 2 ఫోర్లు, సిక్సర్‌‌‌‌తో 14నాటౌట్‌ ) బ్యాట్‌ ఝలిపిం చడంతో రైజర్స్‌‌‌‌ ప్రత్యర్థి ముందు మంచిస్కోరు ఉంచగలిగింది. అనంతరంటార్గెట్‌ ఛేజింగ్‌ లో రాహుల్‌ తోపాటు మయాంక్‌ అగర్వాల్‌ (55) హాఫ్‌సెంచరీతో అదరగొట్టడంతో పంజాబ్‌ 19.5 ఓవర్లలో 4వికెట్లు కోల్పోయి 151 రన్స్‌‌‌‌ చేసి గెలిచింది. రాహుల్​కు మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు దక్కింది. నత్త నడకన..అంతకుముందు టాస్‌ ఓడి బ్యాటింగ్‌ కు దిగిన సన్‌ రైజర్స్‌‌‌‌కు మంచి ఆరంభం దక్కలేదు. సీజన్‌ స్టారింగ్‌ నుంచి సూపర్‌‌‌‌ షోలతో అలరిస్తూ వస్తున్న బెయిర్‌‌‌‌స్టో (1) ఇన్నింగ్స్‌‌‌‌ రెండో ఓవర్‌‌‌‌లోనే అశ్విన్‌ పట్టిన చురుకైన క్యాచ్‌ కుపెవిలియన్‌ చేరాడు. ఆ తర్వాత శంకర్‌‌‌‌తో కలిసి మరోఓపెనర్‌‌‌‌ వార్నర్‌‌‌‌ నెమ్మదిగా ఇన్నింగ్స్‌‌‌‌ను ముందుకునడిపించాడు. దీంతో పవర్‌‌‌‌ ప్లే ముగిసేసరికి హైదరాబాద్‌‌‌‌ 27/1తో నిలిచింది. బంతి బ్యాట్‌ పైకి రాకపోవడంతో పాటు అతి జాగ్రత్తకు పోయిన వీరిద్దరూ సింగిల్స్‌‌‌‌తోనే బండి లాగించారు. వీరబాదుడుకు మారుపేరైన వార్నర్‌‌‌‌ తన శైలికి భిన్నంగా మరీ నెమ్మదిగా ఆడటంతో 6 నుంచి10 ఓవర్ల మధ్య ఒక్క బౌండ్రీ కూడా రాలేదు. అశ్విన్‌ వేసిన పదకొండో ఓవర్‌‌‌‌లో ఓ ఫోర్‌‌‌‌ కొట్టిన శంకర్‌‌‌‌..రాహుల్‌ కు క్యాచ్‌ ఇచ్చి ఔటయ్యాడు. స్కోర్‌‌‌‌ పెంచేందుకు అఫ్గాన్‌ స్పిన్నర్‌‌‌‌ మహ్మద్‌‌‌‌ నబీ(12)ని సెకండ్‌ డౌన్‌ లోపంపిన ప్రయోగం పెద్దగా ఫలించలేదు. భారీ షాట్లుఆడడంలో దిట్టగా పేరున్న నబీ రనౌటైయ్యాడు. వార్నర్‌‌‌‌ ఆడిన స్ట్రెయిట్‌ డ్రైవ్‌ ను ఫాలోత్రోలో ఆపిన అశ్విన్‌ బంతిని వికెట్లపైకి విసిరాడు. ఆ సమయంలో క్రీజు వదిలిముందకు వెళ్లిన నబీ రనౌటై నిరాశగా వెనుదిరిగాడు. ఆ తర్వాత అడపాదడపా బౌండ్రీలు బాదిన వార్నర్‌‌‌‌ 49బంతుల్లో హాప్‌ సెంచరీ పూర్తి చేసుకున్నా డు. మనీశ్‌పాండే (19) కొన్ని విలువైన పరుగులు చేశాడు. నాలుగోవికెట్‌ కు 34 బంతుల్లో 55 పరుగులు జోడించాక మనీశ్‌ఔటయ్యాడు. హుడా ఇన్నింగ్స్‌‌‌‌ చివరి మూడు బంతులకు4,4,6 బాదడంతో రైజర్స్‌‌‌‌ 150 మార్క్‌‌‌‌ టచ్‌ చేసింది.

స్కోర్‌ బోర్డ్‌

హైదరాబాద్‌‌‌‌: వార్నర్‌‌‌‌ (నాటౌట్‌ ) 70, బెయిర్‌‌‌‌స్టో(సి) అశ్విన్‌ (బి) ముజీబ్‌ 1, శంకర్‌‌‌‌ (సి) రాహుల్‌(బి) అశ్విన్‌ 26, నబీ (రనౌట్‌ / అశ్విన్‌ ) 12, మనీశ్‌(సి) సబ్‌ /కరుణ్‌ నాయర్‌‌‌‌ (బి) షమీ19, హుడా(నాటౌట్‌ ) 14; ఎక్స్‌ ట్రాలు: 8; మొత్తం: 20 ఓవర్ల-లో 150/4; వికెట్ల పతనం: 1–7, 2–56, 3–80,4–135; బౌలింగ్‌‌‌‌: రాజ్‌ పుత్‌ 4–0–21–0,ముజీబ్‌ 4–0–34–1, షమీ 4–0–30–1, అశ్విన్‌4–0–30–1, కరన్‌ 4–0–30–0.

పంజాబ్‌‌‌‌: రాహుల్‌ (నాటౌట్‌ ) 71, గేల్‌ (సి) హుడా(బి) రషీద్‌‌‌‌ 16, మయాం క్‌ (సి) శంకర్‌‌‌‌ (బి) సందీప్‌55, మిల్లర్‌‌‌‌ (సి) హుడా (బి) సందీప్‌ 1, మన్‌ దీప్‌(సి) హుడా (బి) కౌల్‌ 2, కరన్‌ (నాటౌట్‌ ) 5;ఎక్స్‌ ట్రాలు: 1; మొత్తం: 19.5 ఓవర్లలో 151/4;వికెట్ల పతనం: 1–18, 2–132, 3–135,4–140; బౌలిం గ్‌ : భువనేశ్వర్‌‌‌‌ 4–0–25–0,సందీప్‌ 4–0–21–2, రషీద్‌‌‌‌ 4–0–20–1, నబీ3.5–0–42–0 , కౌల్‌ 4–0–42–1.