
రాష్ట్రంలో భారీ వర్షాలకు ప్రాజెక్టులు జలకళను సంతరించుకున్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని కిన్నెరసాని ప్రాజెక్టుకు వరదనీరు పొటెత్తింది. దాంతో 12 గేట్లు ఎత్తి అధికారులు నీటిని దిగువకు విడుదల చేశారు. ప్రస్తుతం డ్యాంలో నీటిమట్టం 405 అడుగులకు చేరింది. డ్యాంలోకి ఇన్ ఫ్లో 70 వేల క్యూసెక్కులు కాగా.. ఔట్ ప్లో 60 వేల క్యూసెక్కులుగా ఉంది. పాల్వంచ మండలంలోని యానంబైలు గ్రామం వద్ద విద్యుత్ ఉత్పాదనతో పాటు కొత్తగూడెం థర్మల్ విద్యుత్ కేంద్రానికి నీరందించేందుకు కిన్నెరసాని ప్రాజెక్టు నిల్వ జలాశయాన్ని నిర్మించారు. ఈ ప్రాజెక్టు ద్వారా వ్యవసాయ భూములకు మరియు విద్యుత్ ఉత్పత్తికే కాకుండా.. పాల్వంచ, కొత్తగూడెం పట్టణ ప్రజలకు తాగునీటిని కూడా అందిస్తుంది. రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల వల్ల కిన్నెరసాని ప్రాజెక్ట్ చూడముచ్చటగా మారింది. దాంతో కిన్నెరసాని అందాలను చూసేందుకు అనమతించాలని పర్యాటకులు కోరుతున్నారు.
For More News..