అనంతపురం నుండి ఢిల్లీకి కిసాన్ రైలు

అనంతపురం నుండి ఢిల్లీకి కిసాన్ రైలు

వీడియో లింక్ ద్వారా ప్రారంభోత్సవం

వీడియో లింక్ ద్వారా పాల్గొన్న కేంద్ర మంత్రులు, ఏపీ సీఎం జగన్,

అనంతపురం: రాయలసీమ జిల్లాల్లో అత్యంత వెనుకబడిన కరవు నేల అనంతపురం నుండి  ఢిల్లీకి కిసాన్ రైల్ సేవలు ప్రారంభమయ్యాయి. వీడియో లింక్ ద్వారా ప్రారంభ కార్యక్రమంలో పాల్గొన్న  ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి , కేంద్ర  వ్యవసాయ రైతు సంక్షేమ, గ్రామీణాభివృద్ధి మరియు పంచాయతీ రాజ్ శాఖా మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ , రైల్వే శాఖ సహాయ మంత్రి సురేష్ సి.అంగాడి తదితరులు పాల్గొన్నారు. అనంతపురం నుండి రాష్ట్ర రహదారులు, భవనాల శాఖామాత్యులు మాలగుండ్ల శంకర నారాయణఅనంతపురం పార్లమెంట్ సభ్యులు  తలారి రంగయ్య, జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు, అనంతపురం ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి, గుంతకల్లు డిఆర్ఎం అలోక్ తివారి తదితరులు పాల్గొన్నారు.

 అనంతపురం జిల్లాలోని రైతులు ఢిల్లీలోని అజాద్ పూర్ మార్కెట్లో తమ పంటలను మంచి ధరలకు అమ్ముకునే ఉద్దేశంతో ఈ రైలు సేవలు ప్రారంభించారు. తొలుత స్వయంగా మార్కెట్ కు వెళ్లి అక్కడి పరిస్ధితులు.. ధరలు తెలుసుకునే అకాశం కల్పించారు. కొంత మంది వెంటనే చినీ, జామ, బొప్పాయి తదితర పంటలను రైలులో తీసుకుని బయలుదేరారు. అక్కడ వారే స్వయంగా వ్యాపారులకు నచ్చిన ధరలకు అమ్ముకోవచ్చు. దళారుల బారిన పడి మోసపోకుండా రైతులకు ప్రభుత్వం ఈ అవకాశం కల్పించింది.