ప్రతిపక్షాల గొంతు నొక్కడమే..షర్మిల ఘటనపై కిషన్ రెడ్డి

ప్రతిపక్షాల గొంతు నొక్కడమే..షర్మిల ఘటనపై కిషన్ రెడ్డి

వైఎస్సార్ టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అరెస్ట్ పై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. షర్మిల తన వాహనంలో ఉండగానే వాహనాన్ని క్రేన్ తో లాక్కెళ్లడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. ప్రతిపక్షాల గొంతునొక్కడమే ప్రధాన అజెండగా టీఆర్ఎస్ పాలన కొనసాగుతోందని విమర్శించారు. ఒక మహిళపట్ల అసభ్యకరమైన రీతిలో టీఆర్ఎస్ నాయకులు , కేసీఆర్ ప్రభుత్వం చూపుతున్న దురహంకారం చాలా అసహ్యకరమైనదన్నారు.

ఇవాళ ఉదయం ప్రగతి భవన్ ముట్టడికి వెళ్లిన షర్మిలను పంజాగుట్ట వద్ద పోలీసులు అడ్డుకున్నారు. షర్మిల కారు నుంచ దిగకపోవడంతో ఆమె కారును పోలీసులు క్రేన్ సహాయంతో ఎస్సార్ నగర్ పీఎస్ కు లాక్కెళ్లారు. డమ్మీ తాళాలు తెచ్చి కారు డోర్ ఓపెన్ చేసి షర్మిలను అరెస్ట్ చేశారు.