
ముషీరాబాద్/ఖైరతాబాద్/బషీర్‌బాగ్/మెహిదీపట్నం, వెలుగు : గ్రేటర్‌సిటీలో నీటి సమస్య తలెత్తకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి కోరారు. గురువారం సిటీలోని వేర్వేరుచోట్ల బోర్‌వెల్స్, ఓపెన్ జిమ్‌లు ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా కిషన్‌రెడ్డి మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఓపెన్ జిమ్ లు, స్కూళ్లలో ఫర్నిచర్, ఆర్వో ప్లాంట్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు.
స్వచ్ఛంద, కార్పొరేట్ సంస్థలు ముందుకు రావాలని కోరారు. అయితే ముషీరాబాద్ లో ఓపెన్ జిమ్ ప్రారంభోత్సవం వివాదాస్పదమైంది. ప్రొటోకాల్ పాటించడం లేదని బీఆర్ఎస్నేతలు కిషన్ రెడ్డిని అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఇరుపార్టీల నాయకులు వాగ్వాదానికి దిగారు. ఎమ్మెల్యే ముఠా గోపాల్ కు సమాచారం ఇవ్వకుండా పనులు ఎలా ప్రారంభిస్తారని కిషన్ రెడ్డిని ప్రశ్నించారు. ఎమ్మెల్యేతో ఫోన్లో మాట్లాడాక గొడవ సద్దుమణిగింది.