
ఆపరేషన్ సిందూర్ పై కీలక వ్యాఖ్యలు చేశారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. గత నెల 22 న పెహల్గం ఘటనను ప్రపంచం మొత్తం చూసిందని.. పెహల్గం ఘటన మానవత్వానికే సవాళ్లుగా నిలిచిందని అన్నారు. పిల్లల ముందే తండ్రిని, భార్యల ముందే భర్తలను అతికిరాతంగా, పాశవికంగా కాల్చి చంపడం ప్రపంచంలోనే మొదటిదని అన్నారు కిషన్ రెడ్డి. మానవ సమాజానికి సవాళ్లుగా మారుతున్న ఉగ్రవాదాన్ని వదిలిపెట్టేది లేదని మోడీ చెప్పారని అన్నారు.సంతాపాలు కాదు, సవాళ్లు విసిరే స్థాయికి ఎదిగామని అన్నారు.
మే 6 ఆపరేషన్ సింధూర్ పేరుతో 9 ఉగ్రవాదుల స్థావరాలను భారత సైన్యం ధ్వంసం చేయడం జరిగిందని.. టార్గెట్ చేసిన ఉగ్రవాద స్థావరాలను మాత్రమే పేల్చడం జరిగిందని అన్నారు.జన సమూహం ఎక్కువగా ఉండటంతో రెండు ఉగ్రవాద స్థావరాలను వదిలిపెట్టడం జరిగిందని వెల్లడించారు కిషన్ రెడ్డి. ఎక్కడ కూడా ప్రజలకు విఘాతం కలగకుండా ఆపరేషన్ సింధూర్ ను సక్సెస్ చేయడం ప్రపంచ చరిత్రలో మొదటిదని అన్నారు.
ఉగ్రవాద కార్యక్రమాలకు ఆనాదిగా భారత్ బాలవుతూ వస్తుందని.. ఒక్క కాశ్మీర్ లోనే 46 వేల మంది భారతీయులు ఉగ్రవాదానికి బలయ్యారని అన్నారు. హైదరాబాద్ లో చాలా చోట్లా బాంబ్ దాడులు చేశారని.. ఉగ్ర దాడుల్లో ప్రాణాలు పోతే క్యాండిల్ ర్యాలీలు, సంతాప ప్రకటనలకు మాత్రమే పరిమితం అయ్యేవాళ్ళమని, నేడు మోడీ సారథ్యంలో బ్రహ్మోస్ క్షిపణులతో ఉగ్ర వాదులకు సవాళ్లు విసురుతున్నామని అన్నారు కిషన్ రెడ్డి.
2019 లో పుల్వామా ఘటనలో 40 మంది భారత సైనికులను హతమార్చారని.. ప్రతీకారంగా జైషే మహమ్మద్ హెడ్ క్వార్టర్ పై ప్రతీకారం తీర్చుకున్నామని అన్నారు. పెహల్గం ఘటనకు ప్రతీకారంగా ఆపరేషన్ సింధూర్ తో 9 ఉగ్ర స్థావరాలతో పాటు, ISI నెట్వర్క్ ను పూర్తిగా ధ్వంసం చేశామని.. పాకిస్థాన్ ఎయిర్ బేస్ లను భారత్ సైన్యం చాకచక్యంగా ధ్వంసం చేశాయని అన్నారు. భారత్ పై దాడి చేస్తే ప్రతి దాడి ఎలా ఉంటుందో ఆపరేషన్ సింధూర్ తో రుజువు చేశామని అన్నారు కిషన్ రెడ్డి.
పాకిస్తాన్ పెంచి పోషిస్తున్న ఉగ్రవాదుల ఆర్థిక మూలాలను ధ్వంసం చేసేందుకు 1960 సింధు జలాల ఒప్పందాన్ని రద్దు చేయడం జరిగిందని.. సింధూ జలాల్లో చుక్క నీరు పాకిస్తాన్ కు అందకుండా కఠినమైన చర్యలు చేపట్టడం జరిగిందని అన్నారు. ఆపరేషన్ సింధూర్ లో భారత సైన్యం కాంధార్, పుల్వామా సూత్రధారులను మట్టుపెట్టామని అన్నారు. పాకిస్తాన్ దిక్కుతోచని స్థితిలో తప్పుడు ప్రచారాలు చేస్తోందని అన్నారు కిషన్ రెడ్డి.
దేశ వ్యాప్తంగా 23 వరకు తిరంగా ర్యాలీలు జరుగుతాయని.. శనివారం ( మే 17 ) సాయంత్రం 5 గంటలకు తిరంగా ర్యాలీ ట్యాంక్ బండ్ పై జరుగుతోందని.. చాలా మంది ప్రముఖులకు ఆహ్వానం పంపించామని అన్నారు. తిరంగ ర్యాలీ నా ప్రోగ్రామ్ కాదు, భారత ప్రభుత్వ ప్రోగ్రాం కాదు... ఇది ప్రజల కార్యక్రమని అన్నారు. ఓపెన్ గా ప్రతి ఒక్కరిని ఈ కార్యక్రమానికి ఆహ్వానిస్తున్నామని.. రాజకీయాలకు అతీతంగా భారత సైన్యానికి అండగా నిలబడి, మద్దతు తెలపాలని కోరుతున్నాం