కేసీఆర్​లో టెన్షన్​ మొదలైంది: కిషన్​రెడ్డి

కేసీఆర్​లో టెన్షన్​ మొదలైంది: కిషన్​రెడ్డి

బీజేపీకి అన్ని వర్గాల్లో పెరుగుతున్న గ్రాఫ్​ను చూసి కేసీఆర్‌లో టెన్షన్​ మొదలైంది. అందుకే గజ్వేల్‌తో పాటు కామారెడ్డి నుంచి కూడా పోటీ చేస్తానంటున్నడు. బీఆర్ఎస్ అభ్యర్థుల జాబితా చూస్తుంటే.. మరోసారి అధికారం కల్ల అని కేసీఆర్​కు అర్థమైనట్లుంది. బంగారు కుటుంబ సభ్యులు లోక్‌సభలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించాలంటూ ఢిల్లీలో దొంగ దీక్షలు చేస్తరు

తెలంగాణలో మాత్రం ఏడు  సీట్లే మహిళలకు ఇస్తరు.. ఇవేనా బంగారు కుటుంబానికి వచ్చే లెక్కలు? సిట్టింగులకే మళ్లీ సీట్లు ఇవ్వడం ద్వారా రాబోయే ఎన్నికల్లో ఓటమిని కేసీఆర్ అంగీకరించినట్లయింది.  ఐదేండ్లుగా ఆ ఎమ్మెల్యేలు వాళ్ల నియోజకవర్గాల్లో చేస్తున్న అవినీతి, అక్రమాలకు కేసీఆర్  పచ్చజెండా ఊపినట్లయింది.