
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని 17 పార్లమెంట్ నియోజకవర్గాలకు కన్వీనర్లను, జాయింట్ కన్వీనర్లను నియమిస్తూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. ప్రతి నియోజకవర్గానికి ఒక కన్వీనర్‌ను, ఇద్దరు జాయింట్ కన్వీనర్లను నియమించారు. అదిలాబాద్‌కు భూమయ్య, పెద్దపల్లికి మల్లికార్జున్, కరీంనగర్‌కు బోయినపల్లి ప్రవీణ్ రావు, నిజామాబాద్‌కు శ్రీనివాస్, జహీరాబాద్‌కు రవి కుమార్ గౌడ్ , మెదక్ కు రామ్మోహన్ గౌడ్, మల్కాజి గిరికి శ్రీనివాస్, సికింద్రాబాద్ కు రాజశేఖర్ రెడ్డి నియమితులయ్యారు.
హైదరాబాద్‌కు ఇంద్రసేనారెడ్డి, చేవేళ్లకు మల్లారెడ్డి, మహబూబ్ నగర్ కు పవన్ కుమార్ రెడ్డి, నాగర్ కర్నూలుకు రామకృష్ణారెడ్డి, నల్గొండకు బండారు ప్రసాద్, భువనగిరికి లింగస్వామి, వరంగల్ కు కుమారస్వామి, మహబూబాబాద్ కు శ్రీనివాస్ రెడ్డి, ఖమ్మంకు రామలింగేశ్వరావును నియమించారు. వీరికి జాయింట్ కన్వీనర్లుగా మరి కొంత మంది కూడా అపాయింట్ అయ్యారు.