కేసీఆర్ కు కిషన్ రెడ్డి లేఖ

కేసీఆర్ కు కిషన్ రెడ్డి లేఖ

హైదరాబాద్, వెలుగు: కేంద్ర ప్రభుత్వం “భారతమాల పరియోజన” కార్యక్రమం క్రింద నేషనల్​హైవేస్​అథారిటీ ఆఫ్ ఇండియా(ఎన్ హెచ్ఏఐ) ఆధ్వర్యంలో తెలంగాణలో నిర్మించనున్న రోడ్లకు అవసరమైన భూసేకరణ రాష్ట్ర సర్కార్ పూర్తి చేయాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కోరారు. ఈ పక్రియ వెంటనే పూర్తి చేసి ఆయా హైవేస్ నిర్మాణానికి సహకరించాలని సీఎం కేసీఆర్ ను కోరుతూ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గురువారం లేఖ రాశారు. 

గత 66 ఏండ్లలో తెలంగాణలో 2500 కిలోమీటర్ల నేషనల్ హైవేస్ ఉండగా 2014 నుంచి ఇప్పటి వరకు మరో 2500 కిలోమీటర్ల నేషనల్ హైవేస్ ను కేంద్రం శాంక్షన్ చేసిందని లేఖలో ఆయన గుర్తు చేశారు. తెలంగాణ అభివృద్ధిపై ప్రధాని మోడీ, కేంద్ర ప్రభుత్వ నిబద్దతలకు ఇది నిదర్శమన్నారు. ఇవే కాకుండా, రాష్ట్రంలో మరో 2,500 కిలోమీటర్ల నేషనల్ హైవేస్ ప్రాజెక్టులు వివిధ దశలలో ఉన్నాయని ఆయన గుర్తు చేశారు.