
బీజేపీ స్టేట్ ఆఫీసులో కొత్తగా ఎన్నికైన 8 మంది పార్టీ ఎమ్మెల్యేలతో సమావేశం అయ్యారు కిషన్ రెడ్డి. కాసేపట్లో అందరూ కలిసి భాగ్యలక్ష్మి అమ్మవారికి ఆలయానికి వెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు.
ఇవాళ బీజేపీ ఎమ్మెల్యేలు శాసనాసభాపక్షనేతను ఎన్నుకోనున్నారు. ఫ్లోర్ లీడర్ రేసులో గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్, నిర్మల్ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి ఉన్నారు. అయితే కామారెడ్డిలో కేసీఆర్, రేవంత్ రెడ్డిపై గెలిచిన వెంకటరమణారెడ్డి పేరు కూడా వినిపిస్తోంది.
మరోవైపు ఇవాళ్టి అసెంబ్లీ సమావేశాన్ని బహిష్కరిస్తున్నామన్నారు ఎమ్మెల్యే రాజాసింగ్. MIM ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ప్రొటెం స్పీకర్ గా ఉండటంతో తనతో పాటు బీజేపీ ఎమ్మెల్యేలంతా అసెంబ్లీ సమావేశానికి రావడం లేదని వీడియో రిలీజ్ చేశారు. దేశాన్ని తిట్టే వారిని ప్రొటెం స్పీకర్ గా ఎలా చేస్తారని ప్రశ్నించారు రాజాసింగ్.