అమాయకులను కాల్చిచంపిన చరిత్ర కాంగ్రెస్​ది:కిషన్ రెడ్డి

అమాయకులను కాల్చిచంపిన చరిత్ర కాంగ్రెస్​ది:కిషన్ రెడ్డి

హైదరాబాద్, వెలుగు: 1969 తెలంగాణ ఉద్యమంలో 365 మంది అమాయక విద్యార్థులను కాల్చి చంపిన చరిత్ర కాంగ్రెస్ పార్టీదని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి మండిపడ్డారు. మలిదశ ఉద్యమంలోనూ 1,200 మంది ఆత్మబలిదానం చేసుకున్నారని పేర్కొన్నారు.

శుక్రవారం సికింద్రాబాద్​లో పార్టీ అభ్యర్థి మేకల సారంగపాణికి మద్దతుగా కిషన్ రెడ్డి ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా చిదంబరం వ్యాఖ్యలపై ఫైర్ అయ్యారు. పార్లమెంట్​లో  సుష్మాస్వరాజ్  నేతృత్వంలో బీజేపీకి చెందిన 160 మంది ఎంపీలు, బయట  4  కోట్ల మంది తెలంగాణ ప్రజలు ఆందోళన చేసి.. కాంగ్రెస్ మెడలు వంచి రాష్ట్రాన్ని తెచ్చుకున్నారన్నారు. అయితే, ఉద్యమం విషయంలో ఆ పార్టీ నియంతృత్వంగా వ్యవహరించిందన్నారు.