ప్రధాని మోడీ నాయకత్వాన్ని తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారు: కిషన్ రెడ్డి

ప్రధాని మోడీ నాయకత్వాన్ని తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారు: కిషన్ రెడ్డి

నరేంద్ర మోడీ నాయకత్వంలో విజయం సాధిస్తానమనే విషయంలో దేశంలో ఎవరికీ ఎటువంటి అనుమానం లేదని, ఆ విషయం కాంగ్రెస్ పార్టీకి కూడా తెలుసని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి కిషన్ రెడ్డి అన్నారు. నిన్న(డిసెంబర్ 3) జరిగినటువంటి ఫలితాల్లో మూడు రాష్ట్రాల్లో విజయం సాధించిన బీజేపీ..2024లో రాబోతున్న పార్లమెంటు ఎన్నికల్లో ప్రధాని మోడీ నాయకత్వంలో బీజేపీ హ్యాట్రిక్ కొట్టబోతుందని అన్నారు.  డిసెంబర్ 4వ తేదీ సోమవారం కిషన్ రెడ్డి.. నాంపల్లిలోని బీజేపీ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణలోనూ 2018లో ఒక సీటు సాధించి, 6.9 ఓట్ల శాతంతో ఉన్నటువంటి బీజేపీ.. ఐదు నెలల్లో నాలుగు పార్లమెంటు స్థానాలకు 19 శాతం ఓటింగ్ శాతం పెంచుకుని నాలుగు ఎంపీ సీట్లను గెలుచుకున్న విషయం మీ అందరికీ తెలుసన్నారు. అదే పట్టుదలతో అన్ని పార్లమెంటు స్థానాల్లో గెలుపే లక్ష్యంగా పెట్టుకుని ముందుకెళ్తాం. ఈ ఎన్నికలో ఎలాంటి ఫలితాలు వచ్చినప్పటకీ, పూర్తి స్థాయిలో విజయ లక్ష్యంతో ముందుకు వెళ్తాం. శాసన సభ ఎన్నికల్లో మా నాయకులు డోర్ టు డోర్ వెళ్లినప్పుడు.. ఈసారి ఎవరికి వేసినా.. పార్టమెంటు ఎన్నికల్లో మేం ప్రధాని మోడీకి అండగా ఉంటామని ప్రజలు స్పష్టంగా సంకేతాలు ఇచ్చినట్లు ఆయన తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల్లో మాకు వచ్చిన 8సీట్లు ఉన్నప్పటికీ కూడా80సీట్లు బలాన్ని కూడగట్టుకుని వచ్చే శాసనసభ ఎన్నికల్లో ముందుకు వెళ్తామని చెప్పారు.  ముఖ్యంగా ఈ ఎన్నికలను విశ్లేషించుకుంటామని, ఈ ఫలితాలను సవాల్ గా తీసుకుంటానమి.. రానున్న రోజుల్లో మరింత కసితో పనిచేస్తామన్నారు. 

వచ్చే 5 ఏళ్లు ఒక నిర్మాణత్మక ప్రతిపక్ష పార్టీగా ప్రజల సమస్యలే బీజేపీ గుండె చప్పుడగా వినిపించే పార్టీగా బీజేపీ పోరాడుతుందని చెప్పారు. తెలంగాణ అభివృద్ధికి కోసం ఏ విధంగా అంకిత భావంతో పని చేశామో.. అదేవిధంగా పనిచేస్తామని చెప్పారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టబోతుందని..  ఎటువంటి వివక్ష చూపకుండా ముందుకెళ్తామని అన్నారు.  ఈ ఎన్నికల్లో ప్రజలు ఇచ్చినటువంటి తీర్పును బీజేపీ పార్టీ గౌరవిస్తుందని అన్నారు. మేము ఐదేళ్లుగా చేసిన పోరాటం..  కాంగ్రెస్ పార్టీకి లాభం చేకూరినప్పటికీ.. అదే పోరాట స్పూర్తితో ముందుకు వెళ్తామని చెప్పారు. వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో తెలంగాణలో అద్భుతమైన ఫలితాలు తీసుకొచ్చే విధంగా పనిచేస్తామన్నారు. 

దేశంలో ప్రధాని మోడీ నాయకత్వాన్ని తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారని.. గత ఎన్నికల్లో నాలుగు స్థానాల్లో బీజేపీని గెలిపించడం జరిగిందన్నారు.. ఈ సారి కూడా మెజార్టీ స్థానాలను బీజేపీని గెలుపించుకునే ప్రయత్నంలో మేము త్వరలోనే అన్ని స్థాయిల్లో సమీక్షలు నిర్వహింకుని.. సమగ్రమైన ప్రణాళికతో ముందుకు వెళ్తామని కిషన్ రెడ్డి అన్నారు.