
- దేశ వ్యతిరేకులతో దోస్తీ చేసిండు: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
న్యూఢిల్లీ, వెలుగు: ఇండియా గౌరవాన్ని పెంచుతూ.. దేశాభివృద్ధికి కృషి చేస్తున్న ప్రధాని మోదీని విమర్శించే నైతిక హక్కు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి లేదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. కాశ్మీర్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మోదీపై రాహుల్ చేసిన కామెంట్లను ఖండిస్తున్నట్లు ప్రకటనలో పేర్కొన్నారు. మోదీలో ఆత్మవిశ్వాసం తగ్గిందని, దానికి కారణం తామే అంటూ రాహుల్ చెప్పుకోవడం హాస్యాస్పదంగా ఉందని తెలిపారు.
‘‘మోదీపై 140 కోట్ల మంది ప్రజల విశ్వాసం ఉన్నది. పార్లమెంట్, స్పీకర్ వ్యవస్థను అగౌరవపర్చడం, ఇండియన్ ఆర్మీ సామర్థ్యంపై ప్రశ్నలు లేవనెత్తడం, దేశ వ్యతిరేకులతో దోస్తీ చేయడం, ఓట్ల కోసం కులాలు, మతాల మధ్య చిచ్చుపెట్టడం రాహుల్కు అలవాటైంది’’అని కిషన్ రెడ్డి అన్నారు.