
సీఎం కేసీఆర్ ప్రగతి భవన్ నుంచి ఫామ్ హౌస్ కు వెళ్లడం ఖాయమన్నారు తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి. ఫాంహౌస్ లో ఉంటూ నిర్ణయాలు తీసుకోవద్దన్నారు. డబుల్ ఇంజిన్ సర్కార్ తో నే తెలంగాణ అభివృద్ధి సాధ్యమన్నారు. తెలంగాణను బీఆర్ఎస్ సర్వనాశనం చేసిందని విమర్శించారు.V6 న్యూస్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడారు కిషన్ రెడ్డి.
నిజాం పాలనను తరిమికొట్టిన చరిత్ర తెలంగాణదని చెప్పారు కిషన్ రెడ్డి. తెలంగాణ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని తెలిపారు. వచ్చే పది రోజుల్లో ప్రచారాన్ని మరింత ముమ్మరం చేస్తామని చెప్పారు. తెలంగాణలో జనసేనతో పొత్తు వల్ల లాభమే ఉంటుందన్నారు.
బీజేపీ బీసీ సీఎం అంటే.. బీఆర్ఎస్,కాంగ్రెస్ ఎందుకు ఉలిక్కి పడుతున్నాయని ప్రశ్నించారు కిషన్ రెడ్డి. బీజేపీ ఓ అడుగు ముందుకే స్తే విమర్శలు చేస్తున్నారన్నారు. బీజేపీ సామాజిక దృక్పతంతో పనిచేస్తుందన్నారు. దళిత, గిరిజన బిడ్డలను రాష్ట్రపతి చేసిన చరిత్ర బీజేపీదన్నారు. రాష్ట్రాన్ని బీఆర్ఎస్ సర్వనాశనం చేసిందని విమర్శించారు. అవకాశం ఇస్తే రాష్ట్రంలో మంచి పరిపాలన అందిస్తామని తెలిపారు.
కాళేశ్వర్ విద్యుత్ ఖర్చు 45 వేల కోట్లు అని.. ఎకరాకు నీళ్లివ్వాలంటే 80 వేల ఖర్చు వస్తుందన్నారు కిషన్ రెడ్డి. కాళేశ్వరంపై లక్షకోట్లు వృథా చేశారని .. మేడిగడ్డ పిల్లర్లు పూర్తిగా దెబ్బతిన్నాయన్నారు. కాళేశ్వరంపై మోదీ టైం వచ్చినప్పుడు మాట్లాడుతారని తెలిపారు. తండ్రీ, కొడుకు, కూతురు కోసమేనే రాష్ట్రం తెచ్చుకుంది అని ప్రశ్నించారు.
ఎస్సీ వర్గీకరణ అంశం సుప్రీం కోర్టులో ఉందని.. జనవరిలో ఎస్సీ వర్గీకరణపై క్లారిటీ వస్తుందన్నారు కిషన్ రెడ్డి. వర్గీకరణ వేగవంతం కోసమే కమిటీ వేస్తామన్నారు. లిక్కర్ స్కాంలో దర్యాప్తు కొనసాగుతోందన్నారు. ఆధారాలు దొరికితే దర్యాప్తు సంస్థలు కవితను అరెస్ట్ చేస్తాయని చెప్పారు. చట్టం ఎవరికీ చుట్టం కాదన్నారు. ఆధారాలుంటే కాంగ్రెస్ నేతలు ఎందుకు చూపెట్టడం లేదని ప్రశ్నించారు. కాంగ్రెస్ ను ప్రజలు నమ్మే పరిస్థితి లేదని.. కర్ణాటక హామీలన్నీ ఉత్త గ్యారంటీలే అయ్యాయని విమర్శించారు.