రాజాసింగ్ పై సస్పెన్షన్ కేంద్ర పార్టీ చూస్కుంటది: కిషన్ రెడ్డి

రాజాసింగ్ పై  సస్పెన్షన్  కేంద్ర పార్టీ  చూస్కుంటది: కిషన్ రెడ్డి

సస్సెండ్ అయిన  ఎమ్మెల్యే రాజాసింగ్ విషయంలో  కేంద్ర పార్టీ నిర్ణయం తీసుకుంటుందన్నారు  బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి.   తెలంగాణలో ఒంటరిగానే 119 స్థానాల్లో పోటీ చేస్తామన్నారు. ఎలక్షన్ కమిటీ వేస్తామని.. మీటింగ్ తర్వాత నిర్ణయం ప్రకటిస్తామన్నారు.  తమది క్యాడర్ బేస్డ్ పార్టీ అని.. బీఆర్ఎస్ కుటుంబ పార్టీ మాదిరి.. డైనింగ్ టేబుల్ పై అభ్యర్థుల భవితవ్యాన్ని నిర్ణయించలేమన్నారు.  క్యాడర్ తో మాట్లాడిన తర్వాతే  అభ్యర్థులను  ప్రకటిస్తామని చెప్పారు. 

ALSO READ : చంద్రయాన్ 3 సాఫ్ట్ ల్యాండింగ్ పై అభినందన తీర్మానానికి కేంద్ర కేబినెట్ ఆమోదం

 
రాఖీ ఫెస్టివల్ సందర్భంగా కేంద్రం గ్యాస్ ధర రూ. 200 తగ్గించడం శుభపరిణామం అన్నారు కిషన్ రెడ్డి.  విమోచన దినోత్సవం తర్వాత  రాష్ట్ర వ్యాప్తంగా యాత్ర చేపడుతామని చెప్పారు.  అసెంబ్లీ నియోజకవర్గా వారీగా ప్రజలను కలుస్తామన్నారు.  ప్రధాని పిలుపు మేరకు పెట్రోల్ పై అన్ని రాష్ట్రాలు పన్నులను తగ్గించి ధరలు తక్కువ చేస్తే.. తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర పన్నులను తగ్గించకుండా ప్రజలపై భారం వేసిందన్నారు.