రామ మందిర నిర్మాణాన్ని ఒక పార్టీకి ముడిపెట్టొద్దు : కిషన్‌‌‌‌రెడ్డి

రామ మందిర నిర్మాణాన్ని ఒక పార్టీకి ముడిపెట్టొద్దు : కిషన్‌‌‌‌రెడ్డి
  • ఓటు బ్యాంకు కోసం అయోధ్యపై రాజకీయాలొద్దు: కిషన్‌‌‌‌రెడ్డి 

హైదరాబాద్, వెలుగు: అయోధ్యలో రామ మందిర నిర్మాణాన్ని ఒక పార్టీకి ముడిపెట్టి విమర్శలు చేయడం సరైంది కాదని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌‌‌ అగ్ర నేత సోనియా గాంధీతో పాటు ఆ పార్టీ నేతలు అయోధ్య రామ మందిరానికి వచ్చి సేవ చేయొచ్చన్నారు.

ఓటు బ్యాంకు రాజకీయాల కోసం కాంగ్రెస్ అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవంపై తప్పుడు ప్రచారం చేస్తుందని, ఈ టెంపుల్‌‌‌‌ నిర్మాణం పార్టీ కార్యక్రమం కాదని, ఎన్నికల కోసం ఓపెన్ చేయడం లేదని స్పష్టం చేశారు. ఆదివారం బీజేపీ స్టేట్ ఆఫీస్‌‌‌‌లో మీడియాతో ఆయన మాట్లాడారు. కొన్ని చానల్స్ సైతం అయోధ్య రాముడిపై తప్పుడు కథనాలు ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. దేశంలోని  అన్ని మతాల వా  ళ్లు అయోధ్య రాముని ప్రాణ ప్రతిష్ఠాపన కోసం ఎదురు చూస్తున్నారని చెప్పారు.  

గతంలో ఐసిస్ ఏజెంట్లు ఉండేవాళ్లు..

మోదీ ప్రధాని అవ్వకముందు తెలంగాణలో ఐసిస్ ఏజెం ట్లు ఉండేవాళ్లని కిషన్ రెడ్డి అన్నారు. అందుకే గోకుల్ చాట్, లుంబినీ పార్క్, దిల్‌‌‌‌సుఖ్ నగర్‌‌‌‌‌‌‌‌లో ఒకేసారి బాంబ్ బ్లాస్ట్‌‌‌‌లు జరిగాయని గుర్తుచేశారు. పాకిస్తాన్‌‌‌‌లో ఉండి బటన్ నొక్కితే ఇండియాలో బాంబ్ బ్లాస్ట్‌‌‌‌లు జరిగేవన్నారు. మోదీ ప్రధాని అయ్యాక మత కల్లోలాలు, కర్ఫ్యూలు, ఏకే 47లు, ఆర్డీఎక్స్‌‌‌‌లు లేవన్నారు. 

ఆదివాసీల కోసం లక్ష కోట్లు ఖర్చు చేసినం..

దేశంలోని ఆదివాసీ గిరిజనుల సంక్షేమం కోసం రూ. లక్షా 13 వేల కోట్లు కేంద్ర ప్రభుత్వం ఖర్చు చేసిందని కిషన్ రెడ్డి తెలిపారు. ప్రధాని మోదీ ఆదివాసీల అభివృద్ధి పథకాన్ని గతేడాది నవంబర్ 15న ప్రారంభించారన్నారు. దేశంలో కనుమరుగవుతున్న ట్రైబల్ తెగలను గుర్తించి వారికి ప్రాథమిక హక్కులు, మౌలిక వసతులు కల్పించే కార్యక్రమాన్ని సోమవారం ప్రధాని ప్రారంభించనున్నారని తెలిపారు. ప్రధాని మంత్రి ఆదివాసీల అభివృద్ధి స్కీమ్‌‌‌‌లో భాగంగా 75 గిరిజన ఆదివాసీ తెగలను అభివృద్ధి చేయడానికి కేంద్రం రూ.24,104 కోట్లను కేటాయించిందని చెప్పారు. 

ఈ ఏడాదే ట్రైబల్ వర్సిటీ.. 

సమ్మక్క, సారలమ్మ ఆదివాసీ గిరిజన యూనివర్సిటీని ఈ విద్యా సంవత్సరం నుంచే ప్రారంభించాలని కేంద్రం ఆలోచన చేస్తున్నదని కిషన్‌‌‌‌ రెడ్డి తెలిపారు. కొత్త బిల్డింగ్‌‌‌‌లు పూర్తయ్యే వరకు అద్దె భవనాల్లో వీటిని నిర్వహిస్తామన్నారు. 2018లో ట్రైబల్ మ్యూజియం శాంక్షన్ చేయగా, గత బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌ ప్రభుత్వం భూమి ఇవ్వలేదని ఆరోపించారు. అలాగే, ట్రైబల్ మ్యూజియానికి త్వరలో శంకుస్థాపన చేయనున్నట్లు తెలిపారు.