అయోధ్యపై వివక్ష ఎందుకు?.. కాంగ్రెస్ హిందూ వ్యతిరేకి: కిషన్ రెడ్డి

అయోధ్యపై వివక్ష ఎందుకు?.. కాంగ్రెస్ హిందూ వ్యతిరేకి: కిషన్ రెడ్డి

హైదరాబాద్‌: అయోధ్య ఆహ్వానాన్ని కాంగ్రెస్ తిరిస్కరించడం సరికాదు.. కాంగ్రెస్ హిందూ వ్యతిరేక ధోరణి మరోసారి బయటపడిందని రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మండిపడ్డారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఓటు బ్యాంకు పాలిటిక్స్‌లో భాగంగానే కాంగ్రెస్ అయోధ్య ఆహ్వానాన్ని  బహిష్కరిస్తుందని విమర్శించారు.  

జనవరి 22 కోసం దేశమంతా ఆతృతగా ఎదురుచూస్తోందని.. దేశం మొత్తం అయోధ్య వైపు చూస్తుంటే..కాంగ్రెస్ తన వక్ర బుద్ధితో దూరంగా ఉండాలనుకుంటోందని ధ్వజమెత్తారు. హిందువులకు సంబంధించిన ప్రతి అంశాన్ని కాంగ్రెస్‌ రాజకీయం చేస్తోందనీ.. అయోధ్య కేసు విచారణ సమయంలో కాంగ్రెస్ వితండవాదం చేసిందని ఫైర్ అయ్యారు. అసలు రాముడు ఉన్నాడా అంటూ కోర్టులో వాదనలు వినిపించిందని.. కాంగ్రెస్ ఇలానే ప్రవర్తిస్తే రాబోయే రోజుల్లో ప్రజలే బుద్ది చెబుతారని -కిషన్‌ రెడ్డి అన్నారు.