ఆగస్టు 12 నుంచి ఎంబీబీఎస్ ఫస్టియర్ ఎగ్జామ్స్

ఆగస్టు 12 నుంచి ఎంబీబీఎస్ ఫస్టియర్ ఎగ్జామ్స్

హైదరాబాద్, వెలుగు: కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ (కేఎన్ఆర్​యూహెచ్ఎస్) ఎంబీబీఎస్(న్యూ రెగ్యులేషన్స్) ఫస్టియర్ రెగ్యులర్ పరీక్షల షెడ్యూల్‌ను సోమవారం విడుదల చేసింది.  ఆగస్టు 12 నుంచి 24 వరకు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఎగ్జామ్స్​ నిర్వహించనున్నారు. ఆగస్టు 12న బయోకెమిస్ట్రీ పేపర్-1, 14న పేపర్-2, 17న అనాటమీ పేపర్-1, 19న పేపర్-2, 21న ఫిజియాలజీ పేపర్-1, 24న పేపర్-2 పరీక్షలు జరగనున్నాయి. ఎన్ఎంసీ రూల్స్ ప్రకారం.. మొదటి ఏడాది పాసయ్యేందుకు విద్యార్థులకు నాలుగు ప్రయత్నాల్లో మాత్రమే అవకాశం ఉంటుంది. డిజిటల్ వాల్యుయేషన్ విధానం అమలులో ఉన్నందున, విద్యార్థులకు కేవలం ఒకే ఆన్సర్ బుక్​లెట్ ఇస్తారని అధికారులు తెలిపారు. 

అటెండెన్స్ తప్పనిసరి..

పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు థియరీలో 75 శాతం, ప్రాక్టికల్స్‌లో 80 శాతం హాజరు తప్పనిసరిగా ఉండాలని, ఇంటర్నల్ అసెస్‌మెంట్‌లో కనీసం 50 శాతం మార్కులు సాధించిన వారే అర్హులని వర్సిటీ పేర్కొంది. జులై 2 నుంచి 7వ తేదీ వరకు విద్యార్థులు ఎలాంటి ఫైన్​లేకుండా ఆన్‌ లైన్ లో ఫీజు చెల్లించవచ్చు. రూ.200 ఫైన్‌ తో జులై 8, 9 తేదీల్లో, రోజుకు రూ.100 అదనపు పెనాల్టీతో 10, 11 తేదీల్లో చెలించేందుకు అవకాశం ఇచ్చారు.