నీట్ పీజీ– 2026 స్టేట్ ర్యాంకుల లిస్ట్ విడుదల

నీట్ పీజీ– 2026  స్టేట్ ర్యాంకుల లిస్ట్ విడుదల
  • లిస్టులో 7,676 మంది అభ్యర్థుల వివరాలు 

హైదరాబాద్, వెలుగు: పీజీ మెడికల్ (ఎండీ/ఎంఎస్/డిప్లొమా) కోర్సుల్లో ప్రవేశాల కోసం నీట్ పీజీ–-2026 రాసిన తెలంగాణ అభ్యర్థుల ప్రైమరీ ర్యాంకుల డేటాను కాళోజీ నారాయణరావు హెల్త్ వర్సిటీ శుక్రవారం విడుదల చేసింది. ఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బీఈఎంఎస్ దరఖాస్తులో పర్మనెంట్ స్టేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గా తెలంగాణను ఎంచుకున్న 7,676 మంది అభ్యర్థుల వివరాలను ర్యాంకుల వారీగా వెల్లడించింది. రాష్ట్ర అభ్యర్థుల లిస్టులో పల్లక్షి ప్రసాద్ 633 మార్కులతో ఆలిండియా 2వ ర్యాంక్ సాధించి రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలిచారు. ఆ తర్వాత తాహా అమ్రీన్ (43వ ర్యాంక్ – 607 మార్కులు), జోశ్యుల చైతన్యకార్తీక్ (127వ ర్యాంక్ –598 మార్కులు), చొల్లేటి తేజ(129వ ర్యాంక్ –598 మార్కులు), పట్కూరి మహిత శ్రీకీర్తి (137వ ర్యాంక్ –597 మార్కులు) టాప్ ర్యాంకులు సాధించిన వారిలో ఉన్నారు. ఈ లిస్టులో చివరిగా 1,59,924వ ర్యాంక్ (226 మార్కులు) సాధించిన అభ్యర్థి వరకు పేర్లు నమోదయ్యాయి.

ఇది మెరిట్ లిస్ట్ కాదు.. 

ప్రస్తుతం విడుదల చేసిన డేటాను మెరిట్ లిస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గా భావించరాదని కాళోజీ వర్సిటీ రిజిస్ట్రార్ స్పష్టం చేశారు. అడ్మిషన్ల ప్రక్రియలో భాగంగా యూనివర్సిటీ త్వరలో అధికారిక నోటిఫికేషన్ విడుదల చేయనుందన్నారు. అర్హులైన అభ్యర్థులు ఆన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లైన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లో దరఖాస్తు చేసుకుని, ఒరిజినల్ సర్టిఫికెట్ల వెరిఫికేషన్ పూర్తయిన తర్వాతే అసలైన ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ను విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులు, కోర్టు ఆదేశాలు, లోకల్ స్టేటస్ రూల్స్ ప్రకారమే ఫైనల్ మెరిట్ లిస్టును రూపొందిస్తామని పేర్కొన్నారు.