
సీఎం కేసీఆర్ పాలన తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు తెలంగాణ జన సమితి (TJS) అధ్యక్షుడు కోదండరాం. కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు ఆయన నిరంకుశ పాలనకు అద్దం పట్టేలా ఉన్నాయన్నారు. రాజ్యాంగ పరిరక్షణ సదస్సులో పాల్గొని మాట్లాడారు. అందరికీ సమాన హక్కులు కల్పించిన రాజ్యాంగాన్ని లేకుండా చూస్తున్నారన్నారు. ఆయన చేసిన వ్యాఖ్యలకు వ్యతిరేకంగా అందరం కలిసి కట్టుగా పోరాడాలని పిలుపునిచ్చారు. చట్టం దృష్టిలో అందరు సమానం, కులాలకు మతాలకు తావు లేకుండా అందరూ సమానమని భారత రాజ్యాంగం చెప్పిందన్నారు. సీఎం కేసీఆర్ ఏడేండ్లలో ప్రజల అవసరాల కోసం ఎప్పుడు పని చేయలేదన్నారు. ఉత్తరాలు రాసి నిరుద్యోగులు చనిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్ మాత్రం ఇండస్ట్రియల్ పార్కుల పేరుతో పేద రైతుల నుండి భూములు లాక్కుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రభుత్వాన్ని ప్రశ్నించే ఏ ఒక్కరిని వదలటం లేదన్న కోదండరాం..ప్రజాస్వామ్య పరిరక్షణ మన అందరి కర్తవ్యమన్నారు. ఒక వైపు నిరంకుశ పరిపాలన, మరో పక్క సామాజిక న్యాయం పై సీఎం కేసీఆర్ దాడి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకోవద్దని...అందరం కలిసి పోరాటం చేద్దామని కోరారు. కేసీఆర్.. నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాటానికి సిద్ధమయ్యాం అన్న ఆయన దీనికి సంబంధించి...ఈ నెల 12న తమ కార్యచరణ ప్రకటిస్తామన్నారు.
మరిన్ని వార్తల కోసం..