వందేళ్లయినా కాంగ్రెస్ అధికారంలోకి రాదు

వందేళ్లయినా కాంగ్రెస్ అధికారంలోకి రాదు
  • లోక్సభలో కాంగ్రెస్కు మోడీ కౌంటర్

న్యూఢిల్లీ: కరోనా తర్వాత దేశం దూసుకెళ్తోందని ప్రధాని మోడీ అన్నారు. కొత్త సంకల్పంతో భారత్ దూసుకెళ్తోందని లోక్ సభలో ఆయన చెప్పారు. పేదల ఇళ్లలో వెలుగులు నింపితే.. అది మొత్తం దేశంలో స్ఫూర్తిగా నిలుస్తుందన్నారు. ఇంట్లో గ్యాస్ సిలిండర్ ఉండటం స్టేటస్ సింబర్ గా మారిన దేశంలో.. ప్రతి పేదోడి ఇంట్లో గ్యాస్ కనెక్షన్ ఇవ్వడాన్ని మించిన ఆనందం ఇంకేం ఉంటుందని వ్యాఖ్యానించారు. ‘పేదలకు బ్యాంకు ఖాతాలు తెరవడం ద్వారా పలు ప్రభుత్వ పథకాల ద్వారా వచ్చే డబ్బు నేరుగా వారి ఖాతాల్లో పడుతోంది. పేదలు తమ ఫోన్ తో బ్యాంకింగ్ చేస్తున్నారు’ అని మోడీ అన్నారు. ఇవన్నీ భూమితో అనుబంధం, ప్రజలతో సంబంధాలు ఉన్నవారికే ఇవి కనిపిస్తాయని ప్రతిపక్ష కాంగ్రెస్ ను ఉద్దేశించి మోడీ వ్యంగ్యంగా కామెంట్ చేశారు. హస్తం పార్టీ నేతలు ఇంకా 2014లో ఉన్నారని.. వారు ఏంటనేది ప్రజలు ఇప్పటికే గుర్తించారన్నారు. కాంగ్రెస్ విధానాల్లో సమస్య ఉందన్నారు. 

కాంగ్రెస్ నేతల్లో అహంకారం తగ్గట్లే

కాంగ్రెస్ ను ఏ రాష్ట్రం కూడా స్వీకరించడం లేదని మోడీ విమర్శించారు. తెలంగాణ ఇచ్చామని కాంగ్రెస్ చెప్పుకుందని.. కానీ అక్కడి ప్రజలు ఆ పార్టీ ఓటు వేయలేదన్నారు. వరుస ఓటములు ఎదురవుతున్నా కాంగ్రెస్ నేతల్లో అహంకారం తగ్గట్లేదన్నారు. కాంగ్రెస్ ను విమర్శిస్తూ ఆయన ఓ కవిత చెప్పారు. ‘వారు పగలును రాత్రి అని చెబితే వెంటనే ఒప్పేసుకో. ఒకవేళ నువ్వు ఒప్పుకోకుంటే.. వాళ్లు పగటిపూటే ముసుగు వేసుకుంటారు. అవసరమైతే వాస్తవికతనూ మార్చేస్తారు. వాళ్లకు పొగరు ఎక్కువ. వాళ్లకు తెలిసిందే అనంతం అనుకుంటారు. వాళ్లకు అద్దం చూపిస్తే.. దాన్నీ విరగ్గొట్టేస్తారు’ అని మోడీ కవిత చదివి వినిపించారు. వందేళ్లయినా కాంగ్రెస్ అధికారంలోకి రాదన్నారు. 

కాగా, మోడీ కామెంట్స్ పై కాంగ్రెస్ అభ్యంతరం తెలిపింది. అయితే విపక్షాలు మాట్లాడిన దానిపై సమాధానం చెప్పే హక్కు తనకు ఉందని ఆయన స్పష్టం చేశారు. పవిత్రమైన పార్లమెంట్ ను ప్రజల కోసం ఉపయోగించాని.. కానీ కొన్ని దళాల ప్రయోజనాలకు దీన్ని వినియోగిస్తున్నారని మోడీ అన్నారు. అలాంటి వాటిని తాము సహించబోమని.. దీటుగా బదులిస్తామని పేర్కొన్నారు. అయితే కాంగ్రెస్ సభ్యులు ఈ విమర్శలపై అభ్యంతరం తెలపడంతో సభలో గందరగోళం నెలకొంది. 

మరిన్ని వార్తల కోసం:

వైరల్ అవుతున్న ‘శ్రీవల్లి’ ఇంగ్లిష్ వెర్షన్

జేఎన్‌యూ వీసీగా తెలుగు మహిళ

ఇక డ్రామాలు షురూ.. జాగో తెలంగాణ