రాహుల్ ఆలోచన నచ్చే కాంగ్రెస్కు మద్దతిచ్చా : కోదండరాం

రాహుల్ ఆలోచన నచ్చే కాంగ్రెస్కు మద్దతిచ్చా : కోదండరాం

కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వడానికి కారణం.. రాహుల్ గాంధీ చెప్పిన  ఆలోచన తనకు బాగా నచ్చిందన్నారు ఎమ్మెల్సీ కోదండరాం . సామాజిక అసమానతలు తొలగించినప్పుడు రాజకీయ సమానత్వం లభిస్తుందన్నారు. హైదరాబాద్ చిక్కడపల్లిలోని త్యాగరానికి గ్రామసభలో ఎమ్మెల్సీ కోదండరామ్ కు ఆత్మీయ పౌర సన్మానం జరిగింది.. ఈ సందర్బంగా మాట్లాడిన కోదండరాం.. ఉద్యమ విలువలకు సన్మానం జరగాల్సిన అవసరం ఉందన్నారు. రాజకీయాలు నైతికంగా పటిష్టం చేయాలని సూచించారు. పదవి.. ఔన్నత్యానికి అవసరమా అనే విషయం ఒకసారి ఆలోచించుకోవాలన్నారు..

ALSO READ | ప్రకృతి విపత్తును అపగలిగే శక్తి ఎవరికీ లేదు: మంత్రి పొన్నం

రాజకీయాల్లో నిలదొక్కుకోవడం చాలా కష్టమన్నారు కోదండరాం.  నిరుద్యోగులు,  భూ నిర్వాసితుల సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తున్నామని చెప్పారు.  ప్రజా సమస్యలపై పోరాడడమేవి తమ లక్ష్యం కావాలన్నారు.  ఎమ్మెల్సీగా ఉంటూ బాధ్యతగా వ్యవహరిస్తానని చెప్పారు.  తెలంగాణలోని సమస్యలన్నీ లేవనెత్తుతానన్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు పర్యటించడం శుభ పరిణామమన్నారు.  ప్రజల సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు కోదండరాం. రాంమనోహర్ లోహియా, కర్పూరి ఠాకూర్ లాంటి ఆలోచన విధానానికి అనుగుణంగా కృషి చేస్తామని చెప్పారు కోదండరాం.