సీఎంకు పరిపాలన ఎలా చేయాలో చెప్పాల్సిన దుస్థితి

సీఎంకు పరిపాలన ఎలా చేయాలో చెప్పాల్సిన దుస్థితి

రేపు(బుధవారం) హైదరాబాద్ లో జరిగే సకలజనులసమర భేరి విజయవంతం చేయాలన్నారు టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం. సకలజనుల సమరభేరికి టీజేఎస్ పూర్తి మద్దతిస్తుందన్నారు. ఆర్టీసీ కార్మికులు చేసే సమ్మెకు గొప్ప విశిష్టత ఉందన్నారు. సంగారెడ్డి బస్ డిపో ముందు 25 వ రోజుకు చేరుకున్న ఆర్టీసీ కార్మికుల సమ్మెకు  కోదండరాం మద్దతు తెలిపారు. ఈ సందర్బంగా మాట్లాడిన కోదండరాం.. ముఖ్యమంత్రికి పరిపాలన ఎలా చేయాలో చెప్పాల్సిన దుస్థితి వచ్చిందన్నారు. ప్రతి ఒక్కరం సమ్మెకు మద్దతు ఇస్తూ ప్రజా రవాణా వ్యవస్థను కాపాడుకుందామన్నారు.

ఆర్టీసీ కార్మికుల 25 రోజుల నిరవధిక సమ్మెను చూస్తుంటే గర్వంగా ఉందన్నారు. ఎంతో మంది ఆర్టీసీ కార్మికులు ఆత్మహత్యలు చేసుకొని చర్చలకు పోతే 500 మంది పోలీసులను చుట్టూ పెట్టుకొని చర్చలు జరుపుతాడా? అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి కార్మికులను బెదిరిస్తున్నాని అన్నారు. సమ్మె విరమించకపోతే ప్రైవేట్ బస్సులను నడిపిస్తానని అనడం సరికాదన్నారు.