కొత్త రికార్డు సృష్టించిన విరాట్

కొత్త రికార్డు సృష్టించిన విరాట్

న్యూఢిల్లీ: టీమిండియా కెప్టెన్‌ విరాట్ కోహ్లీ మరో ఘనతను సాధించాడు. సోషల్‌ మీడియాలో అత్యధిక మంది ఫాలోవర్లు ఉన్న క్రికెటర్‌గా కోహ్లి సరికొత్త రికార్డు సృష్టించాడు.  సోషల్‌ మీడియా సైట్లలో కలిపి కోహ్లి ఫాలోవర్ల సంఖ్య 100 మిలియన్స్(10 కోట్లు)మార్క్‌కు చేరింది. ఫేస్‌బుక్‌లో 3.7 కోట్లు, ఇన్‌స్టాగ్రామ్‌లో 3.35 కోట్లు, ట్విటర్‌లో 2.94 కోట్ల మంది కోహ్లిని ఫాలో అవుతున్నారు. ఫలితంగా సోషల్‌ మీడియాలో 10 కోట్ల మంది ఫాలోవర్లను సంపాదించుకున్న ఫస్ట్ క్రికెటర్‌గా కోహ్లి నిలిచాడు.

క్రికెట్ గాడ్ గా పేర్కొనే సచిన్ టెండూల్కర్, కెప్టెన్ కూల్ ఎంఎస్‌ ధోని, హిట్ మ్యాన్ రోహిత్ కు కూడా సాధ్యం కాని ఫ్యాన్ ఫాలోయింగ్ కోహ్లికే ఉందనే విషయం ఈ రికార్డ్ తో స్పష్టమవుతోంది. టీమిండియా ప్లేయర్ గా, కెప్టెన్‌గా అత్యుత్తమ ఆటతీరుతో కోహ్లి ఇప్పటికే అనేక రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. రాబోయే వరల్డ్ కప్ లో మరిన్ని రికార్డులు సాధించాలని సోషల్ మీడియాలో ట్విట్స్ చేస్తున్నారు కోహ్లీ ఫ్యాన్స్.