కొలకలూరి ఇనాక్​కు  గురజాడ సాహితీ పురస్కారం

కొలకలూరి ఇనాక్​కు  గురజాడ సాహితీ పురస్కారం

హైదరాబాద్‌‌‌‌, వెలుగు : కొలకలూరి ఇనాక్ కు గురజాడ అప్పారావు సాహితీ పురస్కారం దక్కింది. బంజారాహిల్స్​లోని మినిస్టర్స్‌‌‌‌ క్వార్టర్స్​లో సోమవారం గురజాడ సాహితీ పురస్కార ప్రదానోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఇనాక్-కు మంత్రి నిరంజన్‌‌‌‌రెడ్డి అవార్డును అందజేశారు. ఉమ్మడి ఏపీలో సాహిత్య అకాడమీ చైర్మన్-గా కొలకలూరి సేవలందించారు.

కార్యక్రమంలో రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ వకుళాభరణం కృష్ణమోహన్ రావు, ఆకృతి సుధాకర్, ఎఫ్-సీసీఐ సంస్థ సీఎండీ జగదీశ్ తదితరులు పాల్గొన్నారు.