ప్లే ఆఫ్ బెర్త్ కోసం.. ఇవాళ చెన్నై తో కోల్ కతా ఢీ

ప్లే ఆఫ్ బెర్త్ కోసం.. ఇవాళ చెన్నై తో కోల్ కతా ఢీ

నైట్‌‌‌‌రైడర్స్‌‌‌‌కు అగ్నిపరీక్ష

దుబాయ్‌‌‌‌:  ప్లే ఆఫ్‌‌‌‌ బెర్తే  లక్ష్యంగా కోల్‌‌‌‌కతా నైట్‌‌‌‌రైడర్స్‌‌‌‌ మరో కీలక మ్యాచ్‌‌‌‌కు సిద్ధమైంది. ఐపీఎల్‌‌‌‌ –13 లీగ్‌‌‌‌ స్టేజ్‌‌‌‌లో భాగంగా గురువారం ఇక్కడ జరిగే మ్యాచ్‌‌‌‌లో చెన్నై సూపర్‌‌‌‌ కింగ్స్‌‌‌‌(సీఎస్‌‌‌‌కే)తో తలపడనుంది.  ఇప్పటిదాకా 12 మ్యాచ్‌‌‌‌లాడి 12 పాయింట్లు సాధించిన నైట్‌‌‌‌రైడర్స్‌‌‌‌.. మిగిలిన రెండు మ్యాచ్‌‌‌‌ల్లో గెలిస్తేనే ప్లే ఆఫ్‌‌‌‌ రేస్‌‌‌‌లో ఉంటుంది. పంజాబ్‌‌‌‌, హైదరాబాద్‌‌‌‌ నుంచి పోటీ ఉన్న నేపథ్యంలో చెన్నైతో జరిగే మ్యాచ్‌‌‌‌లో నైట్‌‌‌‌రైడర్స్‌‌‌‌పై  తీవ్ర ఒత్తిడి ఉండనుంది. తుది దశలో నెట్‌‌‌‌రన్‌‌‌‌రేట్‌‌‌‌కు ప్రాధాన్యముండే చాన్స్‌‌‌‌ ఉండడంతో కోల్‌‌‌‌కతా భారీ విక్టరీపై కన్నేసింది. కానీ అది అనుకున్నంత ఈజీ కాదు.

ప్లే ఆఫ్‌‌‌‌ రేస్‌‌‌‌ నుంచి అందరికంటే ముందే నాకౌటైన సీఎస్‌‌‌‌కే.. ప్రస్తుతం చాలా కూల్‌‌‌‌గా ఉంది.  లాస్ట్‌‌‌‌ మ్యాచ్‌‌‌‌లో బెంగళూరుకు షాకిచ్చిన విధంగానే..  నైట్‌‌‌‌రైడర్స్‌‌‌‌ మతిపోగొట్టాలని టార్గెట్‌‌‌‌ పెట్టుకుంది. జట్ల విషయానికొస్తే  లీగ్‌‌‌‌ తుది దశకు దగ్గరైనా కోల్‌‌‌‌కతా బ్యాటింగ్‌‌‌‌ ఆర్డర్‌‌‌‌ ఇంకా సెటిలవ్వలేదు. శుభ్‌‌‌‌మన్‌‌‌‌ గిల్‌‌‌‌, నితీశ్‌‌‌‌ రాణా, రాహుల్‌‌‌‌ త్రిపాఠి, కెప్టెన్‌‌‌‌ ఇయాన్‌‌‌‌ మోర్గాన్‌‌‌‌ అడపాదడపా రాణిస్తున్నా నిలకడలేమి వారి సమస్యగా మారింది. రీఎంట్రీలో సునీల్‌‌‌‌ నరైన్‌‌‌‌ అదరగొట్టడం కాస్త సానుకూలాంశం. బౌలింగ్‌‌‌‌లో కోల్‌‌‌‌కతాకు పెద్దగా ఇబ్బందుల్లేవు. భారీ మొత్తం వెచ్చించి తెచ్చుకున్న పేసర్‌‌‌‌ కమిన్స్‌‌‌‌ నుంచి మాత్రం స్థాయికి తగ్గ పెర్ఫామెన్స్‌‌‌‌ ఆశిస్తోంది.

ఇక, ప్లే ఆఫ్‌‌‌‌ రేస్‌‌‌‌ నుంచి ఔటైనా.. సీజన్‌‌‌‌ను ఘనంగా ముగించాలని భావిస్తున్న చెన్నై.. లాస్ట్‌‌‌‌ మ్యాచ్‌‌‌‌లో అదరగొట్టింది. జట్టుగా రాణించి బెంగళూరుకు షాకిచ్చింది.  రుత్‌‌‌‌రాజ్‌‌‌‌ ఫామ్‌‌‌‌ కొనసాగించాలని జట్టు భావిస్తుండగా.. డుప్లెసిస్‌‌‌‌, రాయుడు రాణిస్తే ఈజీగా భారీ స్కోరు చేస్తుంది. బెంగళూరుతో మ్యాచ్‌‌‌‌లో సక్సెస్‌‌‌‌ అవ్వడంతో బౌలర్ల కాన్ఫిడెన్స్‌‌‌‌ కూడా పెరిగింది. లాస్ట్‌‌‌‌ పెర్ఫామెన్స్‌‌‌‌ను చెన్నై  రిపీట్‌‌‌‌ చేయగలిగితే నైట్‌‌‌‌రైడర్స్‌‌‌‌కు షాక్‌‌‌‌ తప్పదు. మరి కోల్‌‌‌‌కతా ఈ సవాల్‌‌‌‌ను ఎలా అధిగమిస్తుందో చూడాలి.

FOR MORE NEWS…

For more news…

ఒత్తిడి నుండి రిలాక్స్ కోసం కొత్త కాన్సెప్ట్

బ్రెయిన్ స్ట్రోక్ వస్తే.. ఇంజెక్షన్ తో నయం చేయవచ్చు