ఫిబ్రవరి 17న సార్ మూవీ రిలీజ్

ఫిబ్రవరి 17న  సార్ మూవీ రిలీజ్

కోలీవుడ్ హీరో ధనుష్‌‌ టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోన్న చిత్రం ‘సార్‌‌‌‌’. తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతున్న ఈ చిత్రానికి వెంకీ అట్లూరి దర్శకుడు. సంయుక్తా మీనన్ హీరోయిన్. సూర్య దేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మాతలు. ఇప్పటికే టీజర్‌‌‌‌, సాంగ్‌‌తో  ఆకట్టుకున్న టీమ్ సినిమాపై బజ్ క్రియేట్ చేసింది. డిసెంబర్ 2న సినిమా రిలీజ్ చేయనున్నట్టు ఆల్రెడీ ప్రకటించారు.

కానీ ఫిబ్రవరి 17న రిలీజ్ చేయనున్నట్టు గురువారం కొత్త డేట్‌‌ని అనౌన్స్‌‌ చేశారు. షూటింగ్‌‌తో పాటు పోస్ట్ ప్రొడక్షన్ పూర్తవకపోవడంతో వాయిదా వేసినట్టు తెలుస్తోంది.  ఎడ్యుకేషన్ సిస్టమ్ బ్యాక్‌‌డ్రాప్‌‌లో రూపొందుతోన్న ఈ చిత్రంలో  బాల గంగాధర్ తిలక్ అనే జూనియర్ లెక్చరర్‌‌‌‌గా ధనుష్ నటిస్తున్నాడు. సాయికుమార్, తనికెళ్ల భ‌‌ర‌‌ణి, సముద్ర ఖని, పమ్మి సాయి, హైపర్ ఆది ఇతర పాత్రలు పోషిస్తున్నారు. జి.వి.ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నాడు.