ఒకప్పుడు వజ్రాల సిటీ.. ఇప్పుడు దెయ్యాల నగరం

ఒకప్పుడు వజ్రాల సిటీ.. ఇప్పుడు దెయ్యాల నగరం

ఒకప్పుడు వజ్రాలతో కళకళలాడిన నగరం ఇప్పుడు  నిర్మానుష్యంగా  దెయ్యాల నగరంగా మారి పోయింది.  ఇప్పుడు ఇక్కడ ఇళ్లు ఇసుకలో కూరుకుపోయాయి. అసలు ఆనగరం ఎందుకు అలామారిపోయింది.. ఆ పట్టణం పేరేమిటి.. ఎక్కడ ఉందో తెలుసుకుందాం.. 

నమీబియా ఎడారి మధ్యలో ఉన్న  కోల్‌మాన్‌స్కోప్ - డైమండ్ సిటీ .. ఇప్పుడు నిర్మానుష్యంగా మారి దెయ్యం నగరాన్ని తలపిస్తోంది.  పూర్వం వజ్రాలతో కళకళలాడిన ఈ గ్రామంలోని ఇళ్లు ఇప్పుడు ఇసుకలో కూరుకుపోయాయి. గతంలో జర్మన్లు ఈ నగరానికి వలస వచ్చారు.  అప్పుడు ప్రతి ఏడాది 10 లక్షల క్యారెట్ల వజ్రాలు ఈ గ్రామంలో లభించాయని చెబుతున్నారు.  

 మొదటి వజ్రం ఎవరికి దొరికిందంటే...

 1908 వ సంవత్సరంలో   జకారియాస్ లెవాలా కోల్‌మాన్‌స్కోప్ అనే రైల్వే ఉద్యోగి ట్రాక్ లపై ఇసుకను తొలగిస్తున్నాడు .  అప్పుడు ఆయనకు మెరుస్తున్న ఓ రాయి దొరికింది.  అప్పుడు తన  అధికారి అయిన జర్మన్ బాస్ ఆగస్ట్ స్టాచ్‌కి  ఇచ్చాడు.  ఆ తరువాత వారు దానిని పరిశీలించి వజ్రం అని నిర్దారించారు.   అప్పుడు నమీబియా ప్రాంతంలో జర్మన్ ప్రజలు ఇక్కడకు వచ్చి స్థిర పడి ఇళ్లను నిర్మించుకున్నారు. 

కోల్‌మాన్‌స్కోప్ గ్రామం  జర్మన్ నగరంగా....

నమీబియా ఎడారిలోని కోల్‌మాన్‌స్కోప్ గ్రామం  జర్మన్ నగరంగా మారిపోయింది.  ఇక్కడ నివసిస్తున్న ప్రజలు ఎండ వేడిని తట్టుకోవడానికి ఐస్ ఫ్యాక్టరీ,  విద్యుత్ ఉత్పాదనకు పవర్ స్టేషన్,  స్కూల్స్, ఆస్పత్రి ఇలా అన్నింటిని ఏర్పరచుకున్నారు.   1920 నాటికి ఇక్కడ 300 మంది జర్మన్లు, 40 మంది పిల్లలు  800 మంది ఓవాంబో కార్మికులు కోల్‌మాన్‌స్కోప్‌ గ్రామంలో స్థిరపడ్డారు. 1956 వ సంవత్సరం వరకు ఇక్కడ వజ్రాలు బాగా దొరికాయని ది సన్ నివేదిక ప్రకారం తెలుస్తోంది.  1900 వ సంవత్సరంలో  కోల్‌మాన్‌స్కోప్ గ్రామంలో  వజ్రాలను కనుగొన్నారు. అప్పుడు ఈ ప్రాంతాన్ని ప్రపంచ వ్యాప్తంగా డైమండ్ సిటీగా గుర్తింపు పొందింది. 

మొదటి ప్రపంచ యుద్దం తరువాత

మొదటి ప్రపంచ యుద్దం తరువాత వజ్రాల ధరలు పడిపోవడంతో   అప్పటి వరకు ఇక్కడున్న జర్మన్లు వలస బాట పట్టారు.  40 ఏళ్లు వజ్రాల సిటీగా పేరొందిన కోల్‌మాన్‌స్కోప్ గ్రామం నుంచి ప్రజలు వలస బాట పట్టారు.  అప్పటి నుంచి ఈ ప్రాంతం నిర్యానుష్యంగా మారి దెయ్యాల గ్రామాన్ని తలపిస్తోంది.

పర్యాటక కేంద్రంగా..  

2000 వ సంవత్సరంలో  దక్షిణాఫ్రికా దేశస్తులు టీవీ సీరియల్స్.. సినిమాలు ఈ ఘోస్ట్ టౌన్ లో షూటింగ్ నిర్వహించారు.  అప్పటి నుంచి ఈ ప్రాంతం చారిత్రక ప్రదేశంగా మారింది.   2002 వ సంవత్సరంలో ఘోస్ట్ టౌన్ టూర్స్ అనే టూర్ కంపెనీ పర్యాటకులకు పరిచయం చేసింది.  అప్పటి నుంచి ప్రతి సంవత్సరం   35 వేల మంది పర్యాటకులు ఈ భయంకరమైన ప్రాంతాన్ని సందర్శిస్తారని ది సన్ నివేదిక తెలిపింది.