
భారత సంతతికి చెందిన వారు విదేశాల్లో కీలక పదవులను సొంతం చేసుకుంటూ…దేశ కీర్తిని నలుదిశలా చాటుతున్నారు. ఇందులో భాగంగానే భారత సంతతికి చెందిన కోమటిరెడ్డి సరిత అమెరికాలో కీలక పదవిని దక్కించుకున్నారు. ఆమెను US డిస్ట్రిక్ట్ కోర్ట్ ఫర్ ఈస్ట్రన్ డిస్ట్రిక్ట్ ఆఫ్ న్యూయార్క్ జడ్జీగా నామినేట్ చేస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఇప్పటికే యూఎస్ న్యాయ వ్యవస్థలోని వివిధ విభాగాల్లో పని చేసిన సరిత, ప్రస్తుతం యూఎస్ అటార్నీ ఆఫీస్ ఫర్ ఈస్ట్రన్ డిస్ట్రిక్ట్ ఆఫ్ న్యూయార్క్ (జనరల్ క్రైమ్స్) డిప్యూటీ చీఫ్ గా విధులు నిర్వహిస్తున్నారు. గతంలో ఇదే ఆఫీసులో ఆమె ఇంటర్నేషనల్ నార్కోటిక్స్, మనీ లాండరింగ్, హ్యాకింగ్ అండ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీస్ కోఆర్డినేటర్ గా కూడా పనిచేశారు. బీపీ డీప్ వాటర్ హారిజన్, ఆయిల్ స్పిల్ అండ్ ఆఫ్ షోర్ డ్రిల్లింగ్ జాతీయ కమిషన్ తరఫున లాయర్ గా పలు కేసుల్లో సమర్థవంతంగా వాదనలు వినిపించారు.