డిసెంబర్ 11న కేంద్రమంత్రి నితిన్ గడ్కరినీ కలుస్తా: కోమటిరెడ్డి

డిసెంబర్ 11న కేంద్రమంత్రి నితిన్ గడ్కరినీ కలుస్తా: కోమటిరెడ్డి

తెలంగాణలో పెండింగ్ లో ఉన్న రోడ్లన్నీ పూర్తి చేస్తామన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.   సెక్రటేరియట్ లోని  ఆయన చాంబర్ లో రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫి మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. అనంతరం  పెండింగ్ లో ఉన్న రోడ్లపై అధికారులతో సమీక్ష నిర్వహించారు.   ఇవాళ తొమ్మిది అంశాలపై సంతకం చేశానని చెప్పారు కోమటిరెడ్డి.   నల్గొండ నుండి ముసంపల్లి,ధర్మారం రోడ్డు వెడల్పు ఫైల్ పై సంతకం చేశానన్నారు. 

కేంద్రం నుంచి రోడ్లకు మరిన్ని నిధులు తీసుకొచ్చేందుకు కృషి చేస్తానని చెప్పారు. తెలంగాణ లోని చాలా రాడ్లు బాగాలేవని.. వాటిపై ఫోకస్ పెడుతున్నామన్నారు.  ఎల్బీనగర్- మల్కాపూర్ రోడ్డును త్వరలో పూర్తి చేస్తామన్నారు. 
 

డిసెంబర్ 11న కేంద్రమంత్రి నితిన్ గడ్కరీని కలుస్తామని చెప్పారు కోమటిరెడ్డి.  హైదరాబాద్ - విజయవాడ హైవేను ఆరు లైన్ చెయ్యాలని కేంద్ర మంత్రిని కోరుతామన్నారు. హైదరాబాద్- కల్వకుర్తి వరకు 4 లైన్ రోడ్ల నిర్మాణం గురించి అడుగుతామన్నారు. గత 10 ఏళ్ల లో రోడ్ల పరిస్థితి చాలా దారుణంగా తయారయ్యిందన్నారు. సెక్రేరియట్,అమరవీరుల స్థూపం, అంబేద్కర్ విగ్రహం నిర్మాణంలో అవకతవకలు జరిగితే విచారణ చేపిస్తామన్నారు మంత్రి