ప్రతి మండలంలో స్కిల్ డెవలప్మెం ట్ సెంటర్ ఏర్పాటు చేస్తాం: మంత్రి వెంకట్ రెడ్డి

ప్రతి మండలంలో స్కిల్  డెవలప్మెం ట్ సెంటర్ ఏర్పాటు చేస్తాం: మంత్రి వెంకట్ రెడ్డి

స్కిల్ డెవలప్ మెంట్ సెంటర్లను తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేస్తామన్నారు రాష్ట్ర  రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. జనవరి 19వ తేదీ శుక్రవారం రంగారెడ్డి జిల్లా కొత్తగూడలోని నేషనల్ అకాడమీ ఆఫ్ కన్ స్ట్రక్షన్ క్యాంపస్ లో నిర్వహంచిన 45వ న్యాక్ ఎగ్యిక్యూటివ్ కమిటీ సమావేశానికి న్యాక్ వైస్ చైర్మన్, మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, సీఎస్ శాంతి కుమారి,  ప్రిన్సిపాల్ సెక్రటరీ శ్రీనివాస్ రాజ్ లు పాల్గొన్నారు.

ఈ సమావేశం  అనంతరం మంత్రి మాట్లాడుతూ..  ఫ్యూచర్ కన్స్ట్రక్షన్ అకాడమీతోపాటు స్కిల్ డెవలప్ మెంట్ సెక్టార్స్,  ఓల్డ్ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ లో ఏర్పాటు చేయాలంటుకొంటున్నామని తెలిపారు. అలాగే, కన్స్ట్రక్షన్ యూనివర్సిటీ ప్రపోజల్ కూడా వుందని.. దీనిపై ముఖ్యమంత్రితో మాట్లాడి నిర్ణయం తీసుకుంటామన్నారు.  ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్స్ లో 10వేల మందికి  టీఎస్సీ ద్వారా ట్రైనింగ్ ఇస్తామని చెప్పారు.  ఒకేషనల్, పాలిటెక్నిక్, ఐటిఐ కాలేజీల వారికి టెక్నికల్ గా సపోర్ట్ చేయడం కోసం సుదీర్ఘంగా చర్చించామన్నారు. న్యాక్ ప్రాపర్టీ మిస్ యూజ్ అవ్వకుండా,  లీజ్ తీసుకున్నవారు  ప్రాపర్ గా ఉపయోగించుకునే విధంగా ప్రిన్సిపల్ సెక్రెటరీ కి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగిందన్నారు.

 గత ప్రభుత్వంలో  దుబాయ్ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు తప్పుడు ప్రచారం చేశారని.. దుబాయ్ కంపెనీతో ఎలాంటి ఎంవోయూ కాలేదని మంత్రి తెలిపారు.  రాష్ట్రంలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్  ఏర్పాటుపై సీఎంతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటామన్నారు.  అందులో కమర్షియల్ యాక్టివిటీస్ జరిగితే చర్యలు తీసుకుంటామని.. ఓన్లీ ట్రైనింగ్ సెంటర్ పర్పస్ గా ట్రైనింగ్ డెవలప్మెంట్ ప్రోగ్రాంతో ప్రతీ సంవత్సరం రెండు లక్షల మందికి శిక్షణ ఇస్తామని చెప్పారు.  నిరుద్యోగుల కోసం మండలానికొక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ను ఏర్పాటు చేస్తామని ఆయన తెలిపారు. అంతర్జాతీయ ప్రమాణాలతో పాఠశాలలను అభివృద్ధి చేస్తామన్నారు.  అందులో భాగంగా మొదటిగా మహబూబ్ నగర్ లేదా నల్గొండ జిల్లాలో పైలట్ ప్రాజెక్టుగా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేయాలనుకొంటున్నామని మంత్రి వెంకట్ రెడ్డి చెప్పారు.