జగిత్యాల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి ఆలయాల హుండీ లెక్కింపును ఆధికారులు ఇవాళ నిర్వహించారు. ఇందులో భాగంగా 63 రోజులకు రూ. 1,01,73,995 నగదు సమకూరినట్లు ఆలయ ఈవో తెలిపారు. గురువారం ఈ మేరకు ఓ ప్రకటనల విడుదల చేశారు. గత 63 రోజులుగా భక్తులు సమర్పించిన కానుకల్లో 3.700 కిలోల మిశ్రమ వెండి,92 గ్రాముల మిశ్రమ బంగారం, 40 విదేశీ కరెన్సీ ఆదాయంగా వచ్చినట్లు ఆలయ అధికారులు తెలిపారు.
