సీఎం కేసీఆర్ను కలిసిన కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి

సీఎం కేసీఆర్ను కలిసిన కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి

మునుగోడులో గెలిచిన టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ప్రగతిభవన్ లో సీఎం కేసీఆర్ ను మర్యాదపూర్వకంగా కలిశారు.  మునుగోడు ఉపఎన్నికల్లో తనకు అవకాశం ఇచ్చి గెలిపించినందుకు కేసీఆర్ కు ఆయన ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా కేసీఆర్... కూసుకుంట్లకు శుభాకాంక్షలు తెలిపి శాలువాతో సత్కరించారు. మునుగోడులో ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు ప్రణాళికలు సిద్దం  చేసుకోవాలని కూసుకుంట్లకు కేసీఆర్ సూచించారు. కేసీఆర్ ను కలిసిన వారిలో మంత్రి జగదీశ్ రెడ్డి,  ఎమ్మెల్యేలు గ్యాదరి కిషోర్, జీవన్ రెడ్డి నల్గొండ జిల్లా నాయకులు ఉన్నారు.

రాష్ట్రవ్యాప్తంగా ఎంతో ఉత్కంఠ రేపిన మునుగోడులో బీజేపీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డి పై టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి విజయం సాధించారు. కాంగ్రెస్ అభ్యర్థి స్రవంతి డిపాజిట్ గల్లంతైంది.