జార్ఖండ్‌‌‌‌ కాంగ్రెస్‌‌‌‌ పొలిటికల్ కమిటీలో కొప్పుల రాజు

జార్ఖండ్‌‌‌‌ కాంగ్రెస్‌‌‌‌ పొలిటికల్ కమిటీలో కొప్పుల రాజు
  • ఉత్తర్వులు వెలువరించిన ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్

న్యూఢిల్లీ, వెలుగు: జార్ఖండ్‌‌‌‌ కాంగ్రెస్‌‌‌‌ పొలిటికల్ అఫైర్స్ కమిటీ (పీఏసీ)ని ఏఐసీసీ ఆదివారం ప్రకటించింది. ఈ కమిటీలో సీనియర్ నేత, ఏఐసీసీ కీలక ప్రతినిధి కొప్పుల రాజుకు అధిష్టానం కీలక బాధ్యతలు అప్పగించింది. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆమోదంతో ఈ కమిటీని ఏర్పాటు చేశారు. మొత్తం 36 మంది సభ్యులతో ఈ పొలిటికల్ అఫైర్స్ కమిటీని రూపొందించారు.

ఈ మేరకు ఆదివారం ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌‌‌‌ అధికారిక ఉత్తర్వులను విడుదల చేశారు. జార్ఖండ్ రాజకీయాల్లో రాబోయే సవాళ్లను దృష్టిలో ఉంచుకుని, అనుభజ్ఞులైన నేతలకు ఇందులో ప్రాధాన్యత కల్పించారు. కొప్పుల రాజుతో పాటు పలువురు మాజీ మంత్రులు, సీనియర్ లీడర్లు,రాష్ట్రస్థాయి కీలక నాయకులకు ఈ కమిటీలో చోటు దక్కింది.