
ప్రముఖు నటుడు కోట శ్రీనివాస రావు కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాదపడుతోన్న ఆయన జులై 13న తుది శ్వాస విడిచారు. ఆయన మృతిపట్ల టాలీవుడ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. సినీ,రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. 1978 ప్రాణం ఖరీదు సినిమాతో సీనీ ఎంట్రీ ఇచ్చిన కోట.. అనారోగ్యంతో చాలా రోజుల నుంచి నటనకు దూరంగా ఉంటున్నారు. చివరగా 2023 రిలీజ్ అయిన సువర్ణ సుందరిలో నటించారు.
వ్యక్తిగత జీవితం
కోట శ్రీనివాస రావు 1942 జులై 10న కృష్ణా జిల్లా కంకిపాడులో జన్మించారు. బాల్యము నుంచి కోటకు నాటకాలంటే చాలా ఆసక్తి ఉండేది. సినిమాలకు రాకముందు స్టేట్ బ్యాంకులో పనిచేశాడు. 1966లో ఈయనకు రుక్మిణితో వివాహమయ్యింది. వీరికి ఇద్దరు కూతుళ్లు ఒక కుమారుడు కోట ప్రసాద్. కుమారుడు కోట ప్రసాద్ 2010 జూన్ 21 లో జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించాడు..కోట శ్రీనివాసరావు విజయవాడ ఈస్ట్ నుంచి 1999లో బీజేపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. 2015 లో కోట శ్రీనివాస రావుకు పద్మశ్రీ పురస్కారం లభించింది. 9 నంది పురస్కారాలు అందుకున్నారు.
సినీ జీవితం
1978లో ప్రాణం ఖరీదుతో సీనీ రంగంలోకి ఎంట్రీ ఇచ్చారు కోట అహ నా పెళ్లంట సినిమాలో హీరోయిన్ తండ్రిగా చేసిన పాత్ర కోటకు మంచి గుర్తింపు తెచ్చింది. 1985లో విడుదలైన ప్రతిఘటనతో విలన్ గా ప్రశంసలు అందుకున్నారు. ఆయన కెరీలరో ఓ మైలురాయిగా నిలిచింది. అహంకారి, గణేశ్, శత్రువు,శివ, వందేమాతరం, యముడికి మొగుడు, శివ, బొబ్బిలి రాజా,యమలీల, సంతోషం,బొమ్మరిల్లు,అతడు,రేసుగుర్రం,అత్తారింటికి దారేది, ఖైదీ నం 786, వంటి ఎన్నో సినిమాలు ఆయనకు గుర్తింపు తెచ్చాయి. తెలుగులో చివరగా 2023లో రిలీజ్ అయిన సువర్ణ సుందరి అనే సినిమాలో నటించారు.
40 ఏళ్ల సినీ కెరీర్ లో తెలుగు,హిందీ, కన్నడ,మలయాళంలో మొత్తం750కి పైగా సినిమాల్లో నటించారు. విలన్ గా, కమోడియన్ గా, తండ్రిగా ఇలా ఎన్నో రకాల పాత్రలకు ఆయన జీవం పోశారు. విలక్షణ నటుడిగా పేరు తెచ్చుకున్నారు. ఆయన నటనకు గానూ 9 నంది అవార్డులు, ఒక సైమా అవార్డు గెలుచుకున్నారు 2015లో పద్మశ్రీ అవార్డు లభించింది.