న్యూఢిల్లీ:కోటక్ మహీంద్రా బ్యాంక్ భారత్ లోని డాయిష్ బ్యాంక్ రిటైల్ బ్యాంకింగ్, అఫ్లూయెంట్ ప్రైవేట్ బ్యాంకింగ్, వెల్త్ మేనేజ్మెంట్ వ్యాపారాన్ని రూ.282 కోట్లకు కొనుగోలు చేస్తోంది. ఈ లావాదేవీ ద్వారా రూ.29వేల కోట్ల రుణాలు, రూ.16వేల కోట్ల డిపాజిట్లు, రూ.10,500 కోట్ల ఆస్తులు కోటక్ బ్యాంక్ సొంతం కానున్నాయి.
దాదాపు 1.5 లక్షల మంది వినియోగదారులు, వేలాది మంది ఉద్యోగులు కోటక్ సంస్థలో చేరనున్నారు. ఈ ఒప్పందం 2027 సెప్టెంబర్ నాటికి పూర్తవుతుందని బ్యాంక్ వర్గాలు వెల్లడించాయి. డాయిష్ బ్యాంక్ గ్లోబల్ హౌస్‌బ్యాంక్ వ్యూహంలో భాగంగా ఈ నిర్ణయం వెలువడింది. బ్యాంకింగ్ సేవల కొనసాగింపు కోసం రెండు సంస్థలు కలిసి పనిచేయనున్నాయి. డాయిష్ బ్యాంక్ తన ప్రపంచస్థాయి క్లయింట్లపై దృష్టి పెట్టేందుకు ఈ వ్యాపార విభాగాలను విక్రయిస్తోంది.
