V6 News

గ్రామాల అభివృద్ధికి కృషి: ఎమ్మెల్యే కూనంనేని

గ్రామాల అభివృద్ధికి కృషి: ఎమ్మెల్యే కూనంనేని

పాల్వంచ, వెలుగు : గ్రామాల అభివృద్ధి కృషి చేస్తున్నానని, గ్రామాలు మరింత డెవలప్ కావాలంటే పంచాయతీ ఎన్నికల్లో సీపీఐ బలపరిచిన అభ్యర్థులను గెలిపించాలని కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివ రావు కోరారు.

 గురువారం మండలంలోని ఉల్వనూరు రేగులగూడెం, చండ్రా లగూడెం తో పాటు పలు పంచాయితీల్లో సీపీఐ బలపరిచిన అభ్యర్థులను గెలిపించాలని ప్రచారం నిర్వహించారు. ఆయన వెంట సీపీఐ రాష్ట్ర నాయకులు ముత్యాల విశ్వనాథం, మండల కార్యదర్శి వీసంశెట్టి పూర్ణ తోపాటు పలువురు నాయకులు ఉన్నారు.