
మనోజ్ చంద్ర, మోనికా జంటగా ప్రవీణ పరుచూరి దర్శక నిర్మాతగా తెరకెక్కించిన చిత్రం ‘కొత్తపల్లిలో ఒకప్పుడు’. రానా దగ్గుబాటి సమర్పణలో ఇటీవల విడుదలైన ఈ చిత్రానికి మంచి రెస్పాన్స్ వస్తోందని టీమ్ తెలియజేసింది. ఈ సందర్భంగా ఆదివారం నిర్వహించిన థ్యాంక్స్ మీట్‌లో మనోజ్ చంద్ర మాట్లాడుతూ ‘నేను పోషించిన రామకృష్ణ పాత్రకు అందరూ కనెక్ట్ అవడం ఆనందంగా ఉంది. ప్రవీణ గారు ఇలాంటి సినిమాలు మరెన్నో తీయాలని కోరుకుంటున్నా’ అని చెప్పాడు.
దర్శక నిర్మాత ప్రవీణ మాట్లాడుతూ ‘సినిమాకొస్తున్న రెస్పాన్స్ చాలా సంతోషాన్నిస్తోంది. ఒక నమ్మకం గురించిన కథ ఇది. లైట్ హార్టెడ్ కామెడీతో ప్రేక్షకులు ముందుకు వస్తున్నారు’ అని అన్నారు. నటులు మౌనిక, ఉషా బోనేలా, కొరియోగ్రాఫర్ మెహర్ బాబా పాల్గొన్నారు.