కూకట్పల్లి, వెలుగు: కేపీహెచ్‌బీ కాలనీలో మూడు రోజుల క్రితం జరిగిన మర్డర్ కేసులో నిందితులను కేపీహెచ్‌బీ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. కేపీహెచ్‌బీ కాలనీలో చెత్త సేకరణ ఏరియాల విషయంలో రెండు వర్గాల మధ్య తలెత్తిన వివాదం ముదిరి బోయ నెట్టికల్లు(58) అనే చెత్త తరలింపు కార్మికుడి హత్యకు దారితీసింది.
ఏపీలోని కర్నూలు జిల్లాకు చెందిన ఇతను 8 సంవత్సరాల క్రితం నగరానికి వచ్చి కేపీహెచ్‌బీ కాలనీ తొమ్మిదో ఫేజ్‌లో నివసిస్తున్నాడు. ఇతనితో పాటు భార్య లక్ష్మి, కొడుకులు హనుమంతు, తిరుమలనాయుడు కూడా చెత్త సేకరిస్తుంటారు. కొంతకాలంగా ఏరియాల విషయంలో కాలనీ ఒకటో రోడ్డులో నివసించే బోయ రాజు(37)తో విభేదాలు ఉన్నాయి. తాను చెప్పిన ఏరియాల్లోనే చెత్త సేకరించాలని రాజు పలుమార్లు నెట్టికల్లు కుటుంబ సభ్యులను హెచ్చరించాడు.
వినడం లేదనే కక్షతో ఈ నెల 7న రాత్రి 11:45 గంటల సమయంలో బోయ రాజు తన అనుచరులు నరేశ్(32), అనిల్‌కుమార్(32), వీరన్న(40), ఉరుకుందప్ప(34), రామాంజనేయులు(41)తో కలిసి మద్యం తాగి నెట్టికల్లు ఇంటి వద్దకు వెళ్లి గొడవ చేశాడు. పథకం ప్రకారం తమతో తెచ్చుకున్న ఐరన్ రాడ్లతో నెట్టికల్లుని కొట్టి హత్య చేశారు. అడ్డుకోవటానికి ప్రయత్నం చేసిన నెట్టికల్లు కుటుంబ సభ్యులను కూడా గాయపరిచారు. పరారీలో న్న నిందితులను కేపీహెచ్‌బీ పోలీసులు అరెస్టు చేశారు.
