కల్వకుర్తి ఆయకట్టు పెంపుజీవోలు ఇవ్వండి

కల్వకుర్తి ఆయకట్టు పెంపుజీవోలు ఇవ్వండి

హైదరాబాద్, వెలుగు: మహాత్మా గాంధీ కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీం ఆయకట్టు పెంపునకు సంబంధించి ప్రభుత్వం విడుదల చేసిన జీవోలు సమర్పించాలని తెలంగాణ ప్రభుత్వాన్ని కృష్ణా బోర్డు కోరింది. ఈ మేరకు ఇరిగేషన్ ఈఎన్సీ (జనరల్) మురళీధర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు కేఆర్ఎంబీ ఎస్ఈ అశోక్ కుమార్ శుక్రవారం లేఖ రాశారు.

కల్వకుర్తి లిఫ్ట్ స్కీం ఆయకట్టును 3.65 లక్షల ఎకరాల నుంచి 4.23 లక్షల ఎకరాలకు పెంచారన్న విషయం తమ దృష్టికి వచ్చిందని, దీంతో ఆయకట్టు పెంపునకు సంబంధించి ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను వెంటనే తమకు పంపాలని కోరారు. కాగా, ఏపీ ప్రభుత్వ ఫిర్యాదుతోనే ఆయకట్టు జీవోలు ఇవ్వాలని కోరుతూ తెలంగాణకు బోర్డు లేఖ రాసిందని రాష్ట్ర ఇంజినీర్లు చెబుతున్నారు.