బాలీవుడ్ ఇండస్ట్రీలో విషాదం నెలకొంది. బాలీవుడ్ యంగ్ స్టార్ హీరో, కియారా అద్వానీ భర్త సిద్ధార్థ్ మల్హోత్రా తండ్రి సునీల్ మల్హోత్రా కన్నుమూశారు. అనారోగ్య కారణాలతో ఈనెల 14న ఆయన తుదిశ్వాస విడిచారు. అయితే, ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆయన మరణ వార్త సినీ వర్గాల్లో దిగ్భ్రాంతిని కలిగించింది.
లేటెస్ట్గా హీరో సిద్ధార్థ్ సోషల్ మీడియా వేదికగా తన తండ్రిని గుర్తుచేసుకుంటూ ఎమోషనల్ పోస్టు షేర్ చేశాడు.‘‘నా తండ్రి సునీల్ మల్హోత్రా నిజాయతీ, విలువలతో జీవించారు. ఆయన క్రమశిక్షణకు మారుపేరు. ఎప్పుడూ తలవంచలేదు. కాలం ఆయనకు ఎన్నో పరీక్షలు పెట్టినప్పటికీ అన్నిటినీ తట్టుకొని నిలబడ్డారు. ధైర్యంగా అనారోగ్యాన్ని ఎదుర్కొన్నారు.
ALSO READ : సైకలాజికల్ థ్రిల్లర్‌లో అనుపమ పరమేశ్వరన్..
He was a man of rare honesty, integrity and culture.
— Sidharth Malhotra (@SidMalhotra) February 17, 2026
He lived by values that never bent. Discipline without harshness. Strength without ego. Positivity, even when life tested him beyond measure.
From commanding the seas as a Merchant Navy Captain to facing illness with quiet… pic.twitter.com/aSIV7Iy1kL
స్ట్రోక్ వల్ల ఆయన వీల్ చైర్‌కే పరిమితం చేసినప్పటికీ భయపడలేదు. మీ పాజిటివిటీ ఇప్పటికీ ఈ కుటుంబాన్ని కలిపి ఉంచుతోంది. చివరకు నిద్రలోనే ప్రశాంతంగా తుదిశ్వాస విడిచారు. మీరు లేని లోటు తీరనిది. మీ వల్లే నేను ఈ స్థాయిలో ఉన్న. మీ జ్ఞాపకాలు ఎప్పటికీ పదిలంగాగే ఉంటాయి. లవ్యూ డాడ్’’ అంటూ సిద్ధార్థ్ తన మనసులోని భావాలను వ్యక్తం చేశాడు. ఈ విషయం తెలిసిన వెంటనే బాలీవుడ్ ప్రముఖులు, అభిమానులు సిద్ధార్థ్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.
