రెండు నిమిషాలు కూర్చుని నీళ్ల పంచాయతీ పరిష్కరించుకోలేరా

రెండు నిమిషాలు కూర్చుని నీళ్ల పంచాయతీ పరిష్కరించుకోలేరా

తెలంగాణ రాష్ట్రంలో పేదరికం పోలేదని..పేదరికం నుంచి కేసీఆర్ కుటుంబం మాత్రమే బయటపడిందన్నారు వైఎస్ షర్మిల. సంక్షేమ పాలనలో కేసీఆర్ పూర్తిగా విఫలమయ్యారని విమర్శించారు. వైస్ఆర్ జయంతిని పురస్కరించుకుని ఇవాళ హైదరాబాద్ రాయదుర్గం జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్ లో YSRTPని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు.

కృష్ణా నదిపై పక్క ఏపీ ప్రభుత్వం రెండేళ్లుగా ప్రాజెక్టులు కడుతుంటే ఇప్పుడే కేసీఆర్ మేల్కొన్నారా అని అన్నారు. రెండు నిమిషాలు ఇద్దరు సీఎంలు కూర్చుని నీళ్ల పంచాయతీని పరిష్కరించుకోలేరా అని ప్రశ్నించారు. రాష్ట్రాలుగా విడిపోయిన అన్నదమ్ములుగా కలిసే ఉండమన్నారని తెలిపారు. సమస్య పరిష్కరించే బాధ్యత కేంద్రంపై లేదా అని అన్నారు. న్యాయబద్దంగా తెలంగాణకు దక్కాల్సిన ఒక్క చుక్క నీటిబొట్టును వదులుకోము..అలాగే పక్కరాష్ట్రలకు చెందిన వాటాను అడ్డుకోబోమన్నారు. కాంగ్రెస్ ఇక్కడ నిలబడింది అంటే కారణం వైఎస్ అని చెప్పారు.

నాయకులు అని చెప్పుకుంటున్న చాలామందికి రాజకీయ బిక్ష పెట్టింది వైఎస్ఆర్ అని అన్నారు వైఎస్ షర్మిల.అలాంటి YS ను తెలంగాణ మంత్రులు తిడుతుంటే చేతులకు గాజులు వేసుకొని చూస్తూ కూర్చున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన పేరును ఉచ్ఛరించే అర్హత కాంగ్రెస్ నేతలకు లేదన్న షర్మిల..మేమె నిజమైన వారసులమన్నారు.

కేసీఆర్ అవినీతిపై ఆధారాలున్నాయనే బీజేపీ అధ్యక్షుడు ఎందుకు బయటపెట్టడం లేదని ప్రశ్నించారు షర్మిల.మీ మధ్య ఏమైనా డీల్ కుదిరిందా చెప్పాలన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్నది మీరే కదా.. ఎందుకు చర్యలు తీసుకోరని అన్నారు. వైఎస్ ను తిడితే దేవుడు కూడా క్షమించడన్నారు.

 మిగులు బడ్జెట్ తో ఏర్పడిన తెలంగాణను కేసీఆర్ అప్పుల తెలంగాణ గా చేశారన్నారు వైఎస్ షర్మిల. 4లక్షల కోట్ల అప్పులు చేసి కేసీఆర్ జేబులు నింపుకున్నారు తప్ప తెలంగాణ పేదరికాన్ని తొలగించలేదని ఆరోపించారు. ఎంతమంది ఆత్మహత్య చేసుకున్నారని కేసీఆర్ ఇంట్లో నలుగురికి ఉద్యోగాలు వచ్చాయని ప్రశ్నించారు. ఎన్నో ఉద్యోగాలు ఖాళీ అవుతున్న భర్తీ చేయడం లేదన్నారు. ఎవరైనా ఆత్మహత్యలు చేసుకుంటేనే ఆ కుటుంబానికి మాత్రమే ఉద్యోగం వస్తుందన్నారు. ఉపఎన్నికలు వస్తే మాత్రం త్వరలో నోటిఫికేషన్లు అంటూ హామీలు వస్తాయన్నారు. అంతేకాదు రైతులు కూడా కేసీఆర్ చెప్పిన పంటలే పండించాలని, దయతలచి రుణాలు ఇస్తే తీసుకోవాలి.. అప్పులు భరించలేక ఆత్మహత్యలు చేసుకోవడమే రైతులకు దిక్కైందన్నారు. కంట్లో కారం కొట్టి బెల్లం చేతిలో పెట్టినట్లు 5వేలు ఇచ్చి  రైతు బందులం అంటూ కేసీఆర్ చెప్పుకుంటున్నారని విమర్శించారు వైఎస్ షర్మిల.