బిల్డింగ్‌‌లకు ఎందుకు పర్మిషన్లు... ఇవ్వడం లేదు 

బిల్డింగ్‌‌లకు ఎందుకు పర్మిషన్లు... ఇవ్వడం లేదు 

మున్సిపల్ శాఖ తనవద్దే ఉంచుకున్న రేవంత్ రెడ్డి 3 నెలలుగా ఎందుకు బిల్డింగ్‌‌లకు పర్మిషన్లు ఇవ్వడం లేదో చెప్పాలని కేటీఆర్ ప్రశ్నించారు. డబ్బులు ఇస్తేనే బిల్డింగ్‌‌లకు అనుమతులు ఇస్తున్న మాట నిజం కాదా? ఢిల్లీకి రూ.2,500 కోట్లు పంపింది వాస్తవం కాదా? అని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి సీఎం లెక్క మాట్లాడటం లేదని కేటీఆర్ విమర్శించారు. ఆయన జేబులో కత్తెర పెట్టుకొని జేబుదొంగ లెక్క తిరుగుతున్నాడన్నారు.

ఇలాంటి వ్యక్తి తెలంగాణకు సీఎంగా ఉన్నారని దుయ్యబట్టారు. సికింద్రాబాద్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి పద్మారావు గౌడ్‌‌పై కేటీఆర్ ప్రశంసలు కురిపించారు. గ్రేటర్ రాజకీయాల్లో సికింద్రాబాద్ అంటేనే గుర్తుకొచ్చే పేరు పద్మారావు గౌడ్ అని అన్నారు. 24 ఏండ్ల నుంచి పార్టీకి హైదరాబాద్​లో అండగా ఉన్నారన్నారు. పద్మారావు గౌడ్‌‌ను అభ్యర్థిగా ప్రకటించగానే సికింద్రాబాద్‌‌లో బీఆర్ఎస్ గెలుస్తుందని అందరూ అంటున్నారన్నారు.