కార్యకర్తల కుటుంబాలకు ఇన్సురెన్స్ చెక్కులిచ్చిన కేటీఆర్

V6 Velugu Posted on Aug 04, 2021

ప్రమాదాల్లో చనిపోయిన కార్యకర్తల కుటుంబ సభ్యులు అడిగినవి త్వరలో అందిస్తామని.. ఇది తమ బాధ్యతని అన్నారు.. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. బాధిత కుటుంబాల బాగోగులు చూసుకోవాల్సిన బాధ్యత.. పార్టీ జనరల్ సెక్రటరీలకు అప్పగిస్తున్నామన్నారు. ప్రమాదాల్లో చనిపోయిన టీఆర్ఎస్ కార్యకర్తల కుటుంబ సభ్యులకు..రూ.2 లక్షల  రూపాయల చొప్పున ఇన్స్యూరెన్స్ చెక్కులు అందించారు కేటీఆర్. తెలంగాణ భవన్ లో బాధిత కుటుంబ సభ్యులతో కలిసి భోజనం చేశారు. ఆ తర్వాత 80 మంది కార్యకర్తల కుటుంబ సభ్యులకు చెక్కులు అందించారు. యునైటెడ్ ఇన్స్యూరెన్స్ కంపెనీ ప్రతినిధులకు 18కోట్ల రూపాయల ప్రీమియం చెక్ అందజేశారు కేటీఆర్. వారం రోజుల్లోనే ఇంచార్జీలు, ఎమ్మెల్యేలు బాధిత కుటుంబాలను కలిసి కోరిన విధంగా సాయం అందజేస్తారని చెప్పారు మంత్రి.

 

Tagged KTR Distributes 2 Lakh Rupees Insurance Cheques To Families Of TRS Activists Who Lost Life

Latest Videos

Subscribe Now

More News