జూపల్లిని పట్టించుకోని కేటీఆర్.. ఇది రెండోసారి

జూపల్లిని పట్టించుకోని కేటీఆర్.. ఇది రెండోసారి

అనుచరులతో కలిసి తెలంగాణ భవన్​కు వచ్చిన జూపల్లి

హైదరాబాద్, వెలుగు: మంత్రి కేటీఆర్‌ను కలిసేందుకు తెలంగాణ భవన్​కు వెళ్లిన మాజీ మంత్రి జూపల్లికి తీవ్ర నిరాశ ఎదురైంది. ఆయన అసహనంతో తిరిగి వెళ్లిపోవాల్సి వచ్చింది. కేటీఆర్ కొత్తగా ఎన్నికైన డీసీసీబీ చైర్మన్లతో సోమవారం తెలంగాణ భవన్‌లో సమావేశమయ్యారు. మంత్రులు, ఎమ్మెల్యేలు ఆ మీటింగ్​‌కు వచ్చారు. జూపల్లి కృష్ణారావు కూడా వచ్చారు. అనుచరులను బయటే ఉంచి జూపల్లి ఒక్కరే కేటీఆర్ చాంబర్‌లోకి వెళ్లారు. కానీ ఆయనకు చేదు అనుభవం ఎదురైంది. కేటీఆర్​ జూపల్లిని చూసిన మరుక్షణమే ‘‘ఇప్పుడు ఏమీ మాట్లాడను, తర్వాత కలుద్దాం..’’అని విసుగ్గా అన్నట్టు ఓ సీనియర్ నేత తెలిపారు. కేటీఆర్ తీరుతో జూపల్లి అవమానకరంగా ఫీలయ్యారని, అసహనంగా బయటికి వచ్చి అనుచరులను తీసుకుని వెళ్లిపోయారని చెప్పారు.

ఇది రెండోసారి..

జూపల్లికి గతంలోనూ ఇలా జరిగిందని పార్టీ వర్గాలు చెప్పాయి. కొల్లాపూర్ మున్సిపల్ ఎన్నికల్లో రెబల్స్‌ను జూపల్లి పోటీకి దించారు. కొందరు కౌన్సెలర్లను గెలిపించుకున్నారు. ఫలితాలు వచ్చిన రోజునే తెలంగాణ భవన్‌కు జూపల్లి వచ్చారు. అప్పుడు కేటీఆర్  జూపల్లిని చూసిన వెంటనే తర్వాత కలుద్దామని అన్నారని పార్టీ నేతలు చెప్పారు. ఇప్పుడూ అదే అనుభవం ఎదురైందని పేర్కొన్నారు.

For More News..

రైతులకు గుడ్‌న్యూస్.. త్వరలో రైతు రుణమాఫీ

చట్టం మీ చుట్టం అనుకుంటున్నారా? రాష్ట్ర ప్రభుత్వంపై హైకోర్టు ఫైర్

ఆంధ్రాలో తెలంగాణ లిక్కర్.. కోట్లు దండుకుంటున్న బోర్డర్ వైన్ షాపులు

సోషల్‌‌ మీడియాకు మోడీ గుడ్‌‌బై!