ఈ ఎన్నికల్లో గెలిస్తేనే భవిష్యత్.. మంత్రులపై కేటీఆర్ సీరియస్

ఈ ఎన్నికల్లో గెలిస్తేనే భవిష్యత్.. మంత్రులపై కేటీఆర్ సీరియస్

మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, తలసాని, ఎమ్మెల్యే లు సుధీర్ రెడ్డి, ప్రకాష్ గౌడ్ లపై టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ సీరియస్ అయ్యారు. మీ నియోజక వర్గాల్లోనే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పార్టీకి దెబ్బ పడిందన్నారు. జిహెచ్ఎంసీ ఎన్నికల్లో వ్యవహరించినట్టు ఇప్పుడు కూడా చేయద్దని హెచ్చరించారు. ఈ ఎన్నికల్లో గెలిస్తేనే భవిష్యత్ ఉంటుందన్నారు. ఆయా నియోజకవర్గాల్లో నమోదు చేయించిన ఓట్లు టీఆర్ఎస్ కే  పడాలన్నారు.

బీజేపీ రాష్ట్రానికి చేసిందేమీ లేదన్నారు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. కేంద్రం ITIR ప్రాజెక్టు ఎందుకు రద్దు చేసిందో చెప్పాలన్నారు. TRS ప్రభుత్వం ఆరేళ్లలో లక్షా 32వేల 799 ఉద్యోగాలు ఇచ్చిందన్నారు. ఎవరికైనా అనుమానం వుంటే తాను చర్చకు సిద్దమన్నారు. ప్రధాని మోడీ ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు అన్నారు.. ఇప్పటికీ ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారని ప్రశ్నించారు.  కేంద్రం నుంచి ఎన్ని నిధులు తెచ్చారో బీజేపీ నేతలు సమాధానం చెప్పాలన్నారు.టీఎస్ ఐపాస్ ద్వారా 14 వేల పైన కంపెనీలు స్థాపించామని.. ఇందులో 14 లక్షల ఉద్యోగాలు ఇచ్చామన్నారు.

హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్ నగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై సమావేశం నిర్వహించారు కేటీఆర్. తెలంగాణ భవన్ లో GHMC పరిధిలోని మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, మేయర్, డిప్యూటీ మేయర్ సమావేశానికి హాజరయ్యారు. సురభి వాణిదేవి గెలుపు కోసం అనుసరించాల్సిన వ్యూహంపై నేతలకు మార్గనిర్దేశం చేశారు కేటీఆర్.

లక్షా 32 వేల799 ఉద్యోగాలిచ్చాం.. ఎక్కడైనా చర్చకు రెడీ